Komatireddy | కార్యకర్తలు సూచించిన వ్యక్తికే నకిరేకల్ టికెట్ కేటాయించేలా చూస్తా: ఎంపీ కోమటిరెడ్డి
27న భేటీలో నిర్ణయం Komatireddy | విధాత: నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ను నియోజకవర్గంలోని మెజార్టీ నాయకులు, కార్యకర్తలు సూచించిన వ్యక్తికే కేటాయించేలా చూస్తానని మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల భేటీలో ఆయన మాట్లాడుతూ పార్టీలోకి ఎవరో వస్తున్నారన్న వార్తలు నమ్మి కార్యకర్తలు ఆవేశపడోద్దన్నారు. బీఆరెస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినంత మాత్రన టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా వేముల వీరేశంను ఉద్దేశించి […]

- 27న భేటీలో నిర్ణయం
Komatireddy | విధాత: నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ను నియోజకవర్గంలోని మెజార్టీ నాయకులు, కార్యకర్తలు సూచించిన వ్యక్తికే కేటాయించేలా చూస్తానని మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల భేటీలో ఆయన మాట్లాడుతూ పార్టీలోకి ఎవరో వస్తున్నారన్న వార్తలు నమ్మి కార్యకర్తలు ఆవేశపడోద్దన్నారు.
బీఆరెస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినంత మాత్రన టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా వేముల వీరేశంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నకిరేకల్ నా ప్రాణమని, మీరు భాద పడొద్దని, నియోజకవర్గాన్ని బతికించుకోవాలనే ఆరాటం నాకు కూడా ఉందన్నారు. ఎవరో వస్తేనే గెలుస్తారని అనుకోవద్దని, మీకు కోమటిరెడ్డి ఉంటే కొండంత అండ ఉన్నట్టేనన్నారు. నకిరేకల్ లో 2014, 2018లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరూ ఇద్దరేనన్నారు.
నకిరేకల్ గురించి ఆలోచిస్తే నిద్ర పట్టడం లేదన్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు నా కల ఆగం చేశారన్నారు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే సీఎం కేసీఆర్ తీసుకెళ్లాడని, మళ్ళీ గెలిపించినా పార్టీ మారని వారినే సూచించాలని కోరారు .శాంతియుత నకిరేకల్ కోసం అందరూ అలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈరోజు భేటీలో అందరితో మాట్లాడ లేకపోయానని, ఎల్లుండి 28కి సమావేశాన్ని వాయిదా వేస్తున్నానని, టికెట్ విషయంపై మీ నిర్ణయమే ఫైనల్ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.