Uttam Kumar Reddy | ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు: ఎంపీ ఉత్తమ్‌

50వేల మెజార్టీతో గెలువాలి పీసీసీ మాజీ చీఫ్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి Uttam Kumar Reddy | విధాత : తెలంగాణ ప్రజానీకం బీఆరెస్‌ ప్రభుత్వం, ఆపార్టీ ఎమ్మెల్యే అవినీతి, భూకబ్జాలు, అక్రమాలతో విసిగిపోయి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను గెలిపించేందుకు సిద్ధమయ్యారని పీసీసీ మాజీ చీఫ్‌, ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే 90 రోజులు అందరూ కష్టపడి పనిచేసి […]

  • By: Somu    latest    Aug 26, 2023 11:37 AM IST
Uttam Kumar Reddy | ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు: ఎంపీ ఉత్తమ్‌
  • 50వేల మెజార్టీతో గెలువాలి
  • పీసీసీ మాజీ చీఫ్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Uttam Kumar Reddy | విధాత : తెలంగాణ ప్రజానీకం బీఆరెస్‌ ప్రభుత్వం, ఆపార్టీ ఎమ్మెల్యే అవినీతి, భూకబ్జాలు, అక్రమాలతో విసిగిపోయి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను గెలిపించేందుకు సిద్ధమయ్యారని పీసీసీ మాజీ చీఫ్‌, ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే 90 రోజులు అందరూ కష్టపడి పనిచేసి కాంగ్రెస్‌ విజయం కోసం పనిచేయాలని అభ్యర్ధించారు.

హుజూర్‌నగర్‌లో కనీసం 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ 70 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఓటర్ల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులందరూ తప్పనిసరిగా చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ప్రతి 100 మంది ఓటర్లలో ఒక ఓటరును ఎంపిక చేసి వారికి సమన్వయకర్తగా నియమించాలన్నారు. ఈ సమావేశంలో హుజూర్‌ నగర్‌ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.