MP Uttam Kumar Reddy | రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో.. ఎంపీ ఉత్తమ్ భేటీ

విధాత: పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి రైల్వే సమస్యలపై వినతి పత్రం అందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న వందే భారత్ రైలుతో పాటు నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ప్రెస్ రైలులను నల్గొండ, మిర్యాలగూడలో హాల్ట్ కల్పించాలని కోరారు. మందమర్రి, జగ్గయ్యపేట, మేళ్లచెరువు, మఠంపల్లి, జాన్ పహాడ్, విష్ణుపురం,మిర్యాలగూడ రైల్వే లైన్లో ప్యాసింజర్ రైళ్లను నడపాలని కోరారు. […]

  • Publish Date - April 6, 2023 / 02:16 PM IST

విధాత: పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి రైల్వే సమస్యలపై వినతి పత్రం అందించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న వందే భారత్ రైలుతో పాటు నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ప్రెస్ రైలులను నల్గొండ, మిర్యాలగూడలో హాల్ట్ కల్పించాలని కోరారు.

మందమర్రి, జగ్గయ్యపేట, మేళ్లచెరువు, మఠంపల్లి, జాన్ పహాడ్, విష్ణుపురం,మిర్యాలగూడ రైల్వే లైన్లో ప్యాసింజర్ రైళ్లను నడపాలని కోరారు.

డోర్నకల్, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్నగర్,నేరేడుచర్ల, మిర్యాలగూడల మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరు చేసి వెంటనే పనులు మొదలు పెట్టాలని విన్నవించారు.

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరారు. రైల్వే మంత్రితో ఉత్తమ్ కుమార్ రెడ్డి సుదీర్ఘంగా భేటీ అయి ఆయా అంశాల కు ఉన్న ప్రాధాన్యతలను వివరించి వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.