MSP | ఈ మద్దతు ధరలతో రైతులకు మిగిలేది నష్టమే

MSP విధాత: ఆరుగాలం శ్రమించే రైతుల‌కు ఎప్పుడూ నిరాశే ఎదురవుతున్నది. ముఖ్యంగా వరి రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు తోడు తగ్గిన దిగుబడులు.. గిట్టుబాటు కాని మద్దతు ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. వరికి కనీస గిట్టుబాటు ధర(MSP) దక్కక ఏటా నష్టాన్ని చవిచూస్తున్నారు. ఉత్పాదక ఖర్చులు బారెడుంటే.. రాబడి మూరెడుగా ఉంటున్నది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహార కేబినెట్‌ కమిటీ ఖరీఫ్‌ పంటలకు కనీ ప్రధాని […]

  • Publish Date - June 9, 2023 / 03:50 AM IST

MSP

విధాత: ఆరుగాలం శ్రమించే రైతుల‌కు ఎప్పుడూ నిరాశే ఎదురవుతున్నది. ముఖ్యంగా వరి రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు తోడు తగ్గిన దిగుబడులు.. గిట్టుబాటు కాని మద్దతు ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. వరికి కనీస గిట్టుబాటు ధర(MSP) దక్కక ఏటా నష్టాన్ని చవిచూస్తున్నారు. ఉత్పాదక ఖర్చులు బారెడుంటే.. రాబడి మూరెడుగా ఉంటున్నది.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహార కేబినెట్‌ కమిటీ ఖరీఫ్‌ పంటలకు కనీ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ…. ఖరీఫ్ పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) చూస్తే రైతులకు మిగిలేది ఏమీ ఉండదని స్పష్టమౌతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో రైతులు పండించే పంటలకు కేంద్రం మద్దతు అంతంత మాత్రమే.

దీంతో రైతుకు మిగిలేది కష్టం. నష్టమే అని వ్యవసాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రైతులు పంటల సాగు కోసం పెడుతున్న పెట్టుబడి ఖర్చులపై రాష్ట్ర వ్యయ, ధరల కమిషన్‌ (సీఏసీపీ)కి పంపింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో క్వింటా వరి సాధారణ రకం ధాన్యానికైతే రూ. 3,300, ఏ గ్రేడ్‌ ధాన్యం పండించాలంటే రూ. 3,400, పత్తికి రూ. 11 వేలు, మక్కలకు రూ. 2 వేలు, సోయా పంటకు రూ. 4,500 రైతులు గత ఏడాది పెట్టుబడి పెట్టారు.

దీనికి తోడు విత్తనాలు, యంత్రాలు, డీజిల్‌, కూలీలు ఇతరాత్ర అన్ని రకాల ఖర్చులు కలుపుకుంటే ఈ ఏడాది ఇంకా పెరుగుతాయి. వీటన్నంటిని పరిగణనలోకి తీసుకోకుండా పెట్టుబడి ఖర్చుల్లో కనీసం మూడొంతులైనా లేకుండా కొత్త మద్దతు ధరలు నిర్ణయించడంపై రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. క్వింటాలు వరి ధాన్యం పండించాలంటే రూ. 3,300 ఖర్చు అవుతుంటే.. అంతకంటే రూ. 1,117 తగ్గించి రూ. 2,183 మాత్రమే ఇస్తే రైతులకు ఏమి మిగులుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.

పత్తి కూడా అంతే. పత్తి సాగు చేయాలంటే ఖర్చు రూ. 11 వేలు అవుతున్నది. అంతకన్నా రూ 3,980 తగ్గించి కొత్త మద్దతు ధర ప్రకటించారు. వీటిని బట్టి చూస్తే.. ప్రతి పంట సాగు చేయడానికి రైతులు పెట్టే పెట్టుబడి ఖర్చును జాతీయస్థాయిలో సగటు లెక్కగట్టి దానిపై 50 శాతం కలిపి ఇస్తున్నామని నిన్న కేంద్రం చెప్పిన మాటల్లోని డొల్ల తనం బైటపడుతున్నది.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి బతుకులను ఆగం చేస్తున్నది. 2020 నాటికి రైతుల ఆదారం రెట్టింపు చేస్తామన్న మోడీ మాటలకు కేంద్రం ఏటా ప్రకటిస్తున్న మద్దతు ధరలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.

పంటలకు మద్దతు ధరల అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించే ముందు ఉత్తరాది రాష్ట్రాల్లో పండించే పంటలకు, దక్షిణాది రాష్ట్రాల్లో పండించే పంటలకు చాలా తేడా ఉంటుంది. వ్యవసాయ ఖర్చులు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటాయి. రాష్ట్రాల వారీగా సాగు ఖర్చులను పరిగనణలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Paddy procurement in Sundargarh from Dec 12

కానీ కేంద్రం ఈ విజ్ఞప్తులను ఏవీ పట్టించుకోవడం లేదు. మద్దతు ధరలపై డాక్టర్‌ స్వామి నాథన్‌ కమిటీ రిపోర్టును చెత్తబుట్టలో పడేసింది. అందుకే గత పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగాన్ని వదిలి లక్షలాది మంది రైతులు పట్టణాల్లో నిర్మాణ రంగంలో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా మారిపోయారు. పైగా కొత్త ధరల తర్వాత సాధారణ పరిస్థితుల్లో సగటు పెట్టుబడుల పై సజ్జపై 32 శాతం, కందిపై 56 శాతం, సోయాబిన్‌పై 52 శాతం, మినుమపై 51 శాతం లాభాలు రైతులకు వస్తాయని కేంద్రం సమర్థించుకోవడం హాస్యాస్పంగా ఉన్నది.

రైతులు తాము పడించిన పంటను తాము నిర్ణయించిన ధరకు ఎక్కడైనా అమ్ముకోవచ్చనే ఉద్దేశంతోనే వ్యవసాయ చట్టాలను తెచ్చినట్టు కేంద్రం చెప్పింది. 2020 లో మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చింది. రైతుల సంఘటింతంగా సంవత్సరం పాటు పోరాడి ఆ చట్టాలను వెనక్కి తీసుకునేలా వీరోచితంగా పోరాడారు.మోడీ ప్రభుత్వం ఆ మూడు నల్ల చట్టాల ద్వారా కార్పొరేట్‌ వర్గాలకు లబ్ధి చేకూర్చడానికి, వాటి సంపదను పెంచడానికి వీలుగా వ్యవసాయరంగాన్ని వాటికి కట్టబెట్టాలని రహస్య అజెండాతో పనిచేసింది.

అయితే ఆ నిర్ణయం అమల్లోకి రాకపోయే సరికి ఉదారవాద విధానాలు అమలు చేస్తూ క్రమంగా కనీస మద్దదు ధర పద్ధతిని, ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్‌, ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)ను నాశనం చేసే కుట్రలను మెల్లగా అమలు చేస్తున్నదనితాజాగా ప్రకటించిన మద్దతు ధరలు చూస్తే అర్థమౌతుంది

Latest News