Viral Video | 35 శాతం మార్కుల‌తో టెన్త్ పాసైన కుమారుడు.. సంబురాల్లో పేరెంట్స్

Viral Video | మీ ఇంట్లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న పిల్ల‌లు ఉంటే.. ప‌రీక్ష‌లు రాసి, ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు ఒక ర‌క‌మైన ఆందోళ‌న ఉంటుంది. ఎందుకంటే.. ప‌రీక్ష‌లు ఎలా రాస్తారు.. ఎన్ని మార్కులు సాధిస్తారు. మిగ‌తా పిల్ల‌ల కంటే మా పిల్ల‌లు మెరుగైన మార్కులు సాధిస్తే బాగుండని ప్ర‌తి విద్యార్థి త‌ల్లిదండ్రులు కోరుకుంటారు. ఎక్కువ మార్కులు వ‌స్తే ఆ పిల్ల‌ల‌కు మంచి పార్టీ ఇస్తారు. అంతే కాకుండా పిల్ల‌లు ఊహించ‌న‌టువంటి బ‌హుమానాల‌తో స‌ర్‌ప్రైజ్ చేస్తారు పేరెంట్స్. […]

Viral Video | 35 శాతం మార్కుల‌తో టెన్త్ పాసైన కుమారుడు.. సంబురాల్లో పేరెంట్స్

Viral Video | మీ ఇంట్లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న పిల్ల‌లు ఉంటే.. ప‌రీక్ష‌లు రాసి, ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు ఒక ర‌క‌మైన ఆందోళ‌న ఉంటుంది. ఎందుకంటే.. ప‌రీక్ష‌లు ఎలా రాస్తారు.. ఎన్ని మార్కులు సాధిస్తారు. మిగ‌తా పిల్ల‌ల కంటే మా పిల్ల‌లు మెరుగైన మార్కులు సాధిస్తే బాగుండని ప్ర‌తి విద్యార్థి త‌ల్లిదండ్రులు కోరుకుంటారు. ఎక్కువ మార్కులు వ‌స్తే ఆ పిల్ల‌ల‌కు మంచి పార్టీ ఇస్తారు. అంతే కాకుండా పిల్ల‌లు ఊహించ‌న‌టువంటి బ‌హుమానాల‌తో స‌ర్‌ప్రైజ్ చేస్తారు పేరెంట్స్.

అదే ఒక వేళ త‌క్కువ మార్కులు వ‌చ్చినా, ఫెయిలైనా.. ఆ పిల్ల‌ల‌ను వారి త‌ల్లిదండ్రులు మంద‌లిస్తారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురై చాలా మంది పిల్ల‌లు క్ష‌ణికావేశంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌లు అనేకం చూశాం. కానీ ఈ త‌ల్లిదండ్రులు మాత్రం త‌మ పిల్లాడికి టెన్త్‌లో త‌క్కువ మార్కులు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అత‌న్ని మంద‌లించ‌లేదు. 35 శాతం మార్కుల‌తో ప‌ది పాసైనా ఆ అబ్బాయికి మాన‌సికంగా కుంగిపోకుండా ధైర్యం నూరిపోశారు. అంతేకాదు ఇంట్లో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య సంబురాలు నిర్వ‌హించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ఓ అబ్బాయి మ‌రాఠీ మీడియం పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివాడు. ఇటీవ‌లే మ‌హారాష్ట్ర ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. అయితే ఆ విద్యార్థి ఆరు స‌బ్జెక్టుల్లో 35 మార్కుల చొప్పున సాధించి, బోర్డ‌ర్ మార్కుల‌తో గ‌ట్టెక్కాడు. మొత్తంగా ఎస్సెస్సీ ఫ‌లితాల్లో 35 శాతం మార్కులు సాధించాడు. 35 శాతం మార్కుల‌తో పాసైన త‌మ కుమారుడిని మంద‌లించ‌కుండా, ఎలాంటి కోపానికి గురికాకుండా ఆ పేరెంట్స్ సంబురాలు నిర్వ‌హించారు. నీ శ‌క్తిసామ‌ర్థ్యాల మేర‌కు క‌ష్ట‌ప‌డి చ‌దివి ఈ మార్కులు సాధించినందుకు గొప్ప‌గా ఫీల‌వుతున్నామ‌ని త‌ల్లిదండ్రులు త‌మ కుమారుడిలో పాజిటివ్ శ‌క్తిని నింపారు. ఈ సంబురాల‌కు సంబంధించిన వీడియోను ఐఏఎస్ ఆఫీస‌ర్ అవ‌నిష్ శ‌ర‌ణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.