Mumbai | శ‌బ్ద కాలుష్యం.. ముంబై కొత్త కాన్సెఫ్ట్‌ ‘నో హార‌న్ డే’

Mumbai ఈ నెల 9 నుంచి 16 వ‌ర‌కు వారంపాటు నో హార‌న్ డే నిబంధ‌న ఉల్లంఘిస్తే ఎంవీ యాక్ట్ ప్రకారం కేసు విధాత‌: వాహ‌నాల అన‌వ‌స‌ర హారన్ల‌తో వాతావరణంలో శబ్ద కాలుష్య పెరిగిపోతున్న‌ది. మానవ ఆరోగ్యంపై కూడా అది ప్రతికూల ప్రభావం చూపుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో శ‌బ్ధ కాలుష్యాన్ని అరికట్టేందుకు ముంబై పోలీసులు కొత్త కాన్సెప్టు తెచ్చారు. ఈ నెల 9వ తేదీ నుంచి 16 వ‌ర‌కు వారం రోజుల‌ పాటు 'నో హార‌న్‌ డే'గా […]

Mumbai | శ‌బ్ద కాలుష్యం.. ముంబై కొత్త కాన్సెఫ్ట్‌ ‘నో హార‌న్ డే’

Mumbai

  • ఈ నెల 9 నుంచి 16 వ‌ర‌కు వారంపాటు నో హార‌న్ డే
  • నిబంధ‌న ఉల్లంఘిస్తే ఎంవీ యాక్ట్ ప్రకారం కేసు

విధాత‌: వాహ‌నాల అన‌వ‌స‌ర హారన్ల‌తో వాతావరణంలో శబ్ద కాలుష్య పెరిగిపోతున్న‌ది. మానవ ఆరోగ్యంపై కూడా అది ప్రతికూల ప్రభావం చూపుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో శ‌బ్ధ కాలుష్యాన్ని అరికట్టేందుకు ముంబై పోలీసులు కొత్త కాన్సెప్టు తెచ్చారు. ఈ నెల 9వ తేదీ నుంచి 16 వ‌ర‌కు వారం రోజుల‌ పాటు ‘నో హార‌న్‌ డే’గా పాటించాలని నిర్ణయించారు. వాహనదారుల్లో అన‌వ‌స‌ర‌ హారన్ ట్రెండ్‌ను త‌గ్గించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ముంబైలోని ట్రాఫిక్ కంట్రోల్ బ్రాంచ్ తెలిపింది.

దీనికి వాహ‌న‌దారులంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరింది. ‘నో హార‌న్ డేపై ఇప్ప‌టికే వాహ‌న‌దారుల్లో అవ‌గాహ‌న కల్పించామ‌ని వెల్ల‌డించింది. అంబులెన్స్‌లు, అగ్నిమాపక, ఇతర కొన్ని వాహనాలు మినహా ముంబైలోని అన్ని వాహ‌నాల‌ డ్రైవర్లు, రైడర్లు బుధ‌వారం నుంచి వ‌చ్చే బుధ‌వారం వ‌ర‌కు వారం రోజుల‌పాటు ‘నో హార‌న్‌ డే’గా పాటించాలని ఆదేశించింది.

నిబంధ‌న‌లుఉల్లంఘిస్తే మోటారు వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 194 (ఎఫ్) ప్రకారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ఈ ఏడాది జూన్ 14న కూడా నో హార‌న్ డేగా ముంబైలోని ట్రాఫిక్ కంట్రోల్ బ్రాంచ్ ప్ర‌క‌టించింది. అప్పుడు నిబంధ‌న‌లు ఉల్లంఘించిన 2,116 మందిని కేసు న‌మోదు చేసింది. ఇలాంటి ప్ర‌త్యేక రోజుల్లో మాత్ర‌మే కాకుండా అన‌వ‌స‌రంగా డ్రైవ‌ర్లు హార‌న్ వేయ‌కుండా ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ది.