మునుగోడు: తొలిరోజు 2 నామినేషన్లు.. ఆ ఇద్దరు ఎవరంటే?

విధాత‌: మునుగోడు ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ప్రకటనతో టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెర పడటంతో తొలి రోజు నుంచే నామినేష‌న్లు దాఖ‌లు కావటం మొదలైంది. కాగా.. నామినేషన్‌ పత్రాలను చండూరు తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి స్వీకరిస్తున్నారు. సింగిల్‌ విండో పద్ధతిన చండూరు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో 48 గంటల ముందు దరఖాస్తు చేస్తే 48 గంటల లోపల ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిన అనుమతులు […]

మునుగోడు: తొలిరోజు 2 నామినేషన్లు.. ఆ ఇద్దరు ఎవరంటే?

విధాత‌: మునుగోడు ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ప్రకటనతో టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెర పడటంతో తొలి రోజు నుంచే నామినేష‌న్లు దాఖ‌లు కావటం మొదలైంది.

కాగా.. నామినేషన్‌ పత్రాలను చండూరు తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి స్వీకరిస్తున్నారు. సింగిల్‌ విండో పద్ధతిన చండూరు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో 48 గంటల ముందు దరఖాస్తు చేస్తే 48 గంటల లోపల ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిన అనుమతులు జారీ చేయనున్నారు. మొదటి రోజు ఏకంగా 50 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకున్నారు.

అయితే.. ఈరోజు నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ముగిసే సమయానికి.. కేవలం రెండు నామినేష‌న్లు మాత్రమే దాఖ‌ల‌య్యాయి. వీటిలో.. ఒకటి ప్రజా ఏక్తా పార్టీ నుంచి నాగరాజు నామినేషన్ కాగా.. మరొకటి స్వతంత్ర అభ్యర్థిగా మారం వెంక‌ట్ రెడ్డి దాఖ‌లు చేశారు.

నామినేషన్ల పర్వం నేపథ్యంలో చండూరు పట్టణంలో 144 సెక్షన్‌ అమలవుతోంది. నామినేషన్లు స్వీకరణకు 30 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నామినేషన్‌ వేసే అభ్యర్థుల వెంట కేవలం ఐదుగురిని మాత్రమే రిటర్నింగ్‌ కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ముఖ్యమైన తేదీలివే

ఉప ఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ – అక్టోబరు 7, 2022
నామినేషన్లకు ఆఖరి తేదీ – అక్టోబరు 14, 2022
నామినేషన్ల పరిశీలన – అక్టోబరు 15, 2022
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ – అక్టోబరు 17, 2022
పోలింగ్ తేదీ – నవంబరు 3, 2022
కౌంటింగ్ తేదీ – నవంబరు 6, 2022