Musi floods | మూసీ వరదల్లో చిక్కుకున్న ఐదుగురు.. కాపాడిన రెస్క్యూ బృందం
Musi floods విధాత: మూసీ నది గేట్లను ఎత్తివేయడంతో దిగువన దామరచర్ల మండలం తెట్టికుంట్ల గ్రామం వద్ద వరద ఉదృతిలో చిక్కుకున్న ఐదుగురిని రెస్క్యూ టీమ్ కాపాడింది. గ్రామానికి చెందిన జంగలి రమేష్, బూరి నగేష్, జంగలి సైదులు, గుండెబోయిన వెంకన్న, ధనావత్ సైదలు మూసీ నదిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. నదిలో ఒక్కసారిగా వరద ఉదృతి పెరగడంతో వారు వరద నీటిలో చిక్కుకుని ప్రాణాపాయంలో పడిపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం స్థానికులతో కలిసి తాడు, […]
Musi floods
విధాత: మూసీ నది గేట్లను ఎత్తివేయడంతో దిగువన దామరచర్ల మండలం తెట్టికుంట్ల గ్రామం వద్ద వరద ఉదృతిలో చిక్కుకున్న ఐదుగురిని రెస్క్యూ టీమ్ కాపాడింది. గ్రామానికి చెందిన జంగలి రమేష్, బూరి నగేష్, జంగలి సైదులు, గుండెబోయిన వెంకన్న, ధనావత్ సైదలు మూసీ నదిలో చేపలు పట్టేందుకు వెళ్లారు.
నదిలో ఒక్కసారిగా వరద ఉదృతి పెరగడంతో వారు వరద నీటిలో చిక్కుకుని ప్రాణాపాయంలో పడిపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం స్థానికులతో కలిసి తాడు, జాకెట్‌ల సాయంతో వరద నీటి ఉదృతి నుండి వారిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram