Music Director Raj | రాజ్‌ మృతితో భావోద్వేగానికి గురైన కోటి.. విడిపోవడం బాధగా ఉందంటూ..!

Music Director Raj | ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్‌ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను తెలుసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి భావోద్వేగానికి గురయ్యారు. సినీ సంగీత ప్రపంచంలో రాజ్‌-కోటి ఇద్దరూ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు స్వరాలు సమకూర్చారు. ఇద్దరూ కలిసి దాదాపు 3వేలకుపైగా పాటలకు స్వరాలను అందించారు. ఇప్పటికీ ఇందులో ఎన్నో అద్భుతమైన పాటలు నేటి తరాన్ని సైతం ఉర్రూతలూగిస్తున్నాయి. కోటి చెన్నైలో […]

Music Director Raj | రాజ్‌ మృతితో భావోద్వేగానికి గురైన కోటి.. విడిపోవడం బాధగా ఉందంటూ..!

Music Director Raj | ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్‌ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను తెలుసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి భావోద్వేగానికి గురయ్యారు.

సినీ సంగీత ప్రపంచంలో రాజ్‌-కోటి ఇద్దరూ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు స్వరాలు సమకూర్చారు. ఇద్దరూ కలిసి దాదాపు 3వేలకుపైగా పాటలకు స్వరాలను అందించారు. ఇప్పటికీ ఇందులో ఎన్నో అద్భుతమైన పాటలు నేటి తరాన్ని సైతం ఉర్రూతలూగిస్తున్నాయి. కోటి చెన్నైలో ఉండగా.. రాజ్‌ మరణవార్తను తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సోదర సమానుడైన రాజ్‌ చనిపోయాడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని, ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. రాజ్‌కు ఆరోగ్య సమస్యలున్నాయని తనకు అనిపించలేదని, తను సైతం ఎన్నడూ చెప్పలేదన్నారు. రాజ్‌ మృతి ఎంతో బాధను కలిగించింది. ఇద్దరం కలిసి ఎన్నో చిత్రాలకు కలిసి పని చేశామని, బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ ఇచ్చామని గుర్తు చేసుకున్నారు.

ఇద్దరం విడిపోయినా కోటిగా సినిమా చేసినా వాటిని సైతం రాజ్‌-కోటి పాటలు అనే వారన్నారు. ఇద్దరం కలిసి 24గంటలు పని చేసేవారమని చెప్పారు. చక్రవర్తి వద్ద అసిస్టెంట్లుగా పని చేశామని, ముఠామేస్త్రి, హలో బ్రదర్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చామని, తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించామన్నారు.

పాటల రూపంలో రాజ్‌ కలకాలం ఉంటాడని, పరిస్థితుల కారణంగా ఇద్దరం విడిపోయామన్నారు. రాజ్‌కి తాను ఓ తమ్ముడిలాంటి వాడినని, చిన్ననాటి స్నేహితులమన్నారు. ఇద్దరం విడిపోవడం ఇప్పటికీ బాధగానే ఉంటుందని, వద్దురా విడిపోవద్దు అన్నాడని, అప్పటి పరిస్థితులతో విడిపోయమంటూ కోటి భావోగ్వేదానికి గురయ్యారు.