Palamuru | నాగం.. కూచుకుళ్ళ ఒక్కటవుతారా ?

Palamuru కాంగ్రెస్‌లో చేరబోతున్న కూచుకుళ్ళ కాంగ్రెస్‌లోనే ఉన్న మాజీ మంత్రి నాగం ఒకే పార్టీలో ఇద్దరు ఒక్కటవుతారా ఎప్పటిలాగే ఎడ మొహం.. పెడమొహంగా ఉంటారా ఇద్దరు ఒక్కటై బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తారా ఇద్దరి రాజకీయ కలయిక కోసం కార్యకర్తల ఎదురుచూపు ఇద్దరు కలిస్తే రసవత్తరంగా నాగర్ కర్నూల్ రాజకీయం విధాత, మహబూబ్ నగర్ ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రాసకందాయంలో పడుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రాజకీయం వేడి సెగలు పుట్టిస్తోoది. […]

  • Publish Date - July 12, 2023 / 11:06 AM IST

Palamuru

  • కాంగ్రెస్‌లో చేరబోతున్న కూచుకుళ్ళ
  • కాంగ్రెస్‌లోనే ఉన్న మాజీ మంత్రి నాగం
  • ఒకే పార్టీలో ఇద్దరు ఒక్కటవుతారా
  • ఎప్పటిలాగే ఎడ మొహం.. పెడమొహంగా ఉంటారా
  • ఇద్దరు ఒక్కటై బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తారా
  • ఇద్దరి రాజకీయ కలయిక కోసం కార్యకర్తల ఎదురుచూపు
  • ఇద్దరు కలిస్తే రసవత్తరంగా నాగర్ కర్నూల్ రాజకీయం

విధాత, మహబూబ్ నగర్ ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రాసకందాయంలో పడుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రాజకీయం వేడి సెగలు పుట్టిస్తోoది. ముఖ్యంగా ఉద్ధoడుల మధ్య పోరు అనేది నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఎన్నికల్లో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మధ్య పోటీ జరుగుతూ వస్తోంది.

టీడీపీ హయాంలో నాగంను ఢీ కొట్టే నాయకుడే లేకుండే. తెలంగాణ రాష్ట్రo ఏర్పడిన తరువాత నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కోల్పోయింది. దీo తో నాగం సొంత పార్టీ పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. తరువాత బీజేప లో చేరి మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి 2012లో పోటీ చేసి ఓటమి చెందరు.అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 2018 లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు.

తెరాస నుంచి పోటీ చేసిన మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొంది నాగంకు షాక్ ఇచ్చారు.ఎదురులేని నాయకునిగా పేరుపొందిన నాగం పరిస్థితి నియోజకవర్గం లో నామరూపాలు లేకుండా పోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ నుంచి బరిలో ఉండాలని అనుకొంటున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. గతంలో నాగం టీడీపీలో ఉన్న సమయంలో పోటీగా కాంగ్రెస్ నుంచి కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి ఉండేవారు.

ఇద్దరి మధ్య రాజకీయ పోటీ రాసవత్తరంగా ఉండేది. ఇద్దరి ఉద్దండుల పోరు అని ఈ నియోజకవర్గం ప్రజలు చర్చించుకునేవారు.ప్రస్తుతం కూచుకుళ్ళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు రంగం సిద్ధo చేసుకున్నారు. ఇందుకు ఈ నెల 20న కొల్లాపూర్ లో జరిగే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు.ఇదే జరిగితే నాగం, కూచుకుల్ల ఒకే గూటికి చేరుకుంటారు. మరి ఇద్దరి మధ్య బంధం స్నేహ పూ రితంగా ఉంటుందో… లేకుంటే రాజకీయ శత్రువు లు గా ఉంటారో కొద్ది రోజుల తరువాత వెలుగు చూసే అవకాశం ఉంది.

ఇద్దరు ఒక్కటైతే బీఆర్ఎస్‌కు షాకు

ఇద్దరు ఉద్ధoడులు ఒక్కటైతే బీఆర్ఎస్‌ కు ఓటమి తప్పదని నియోజకవర్గం లో చర్చిoచు కుంటున్నారు. కానీ ఇది జరిగే పని కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కార్యకర్తలు మాత్రం ఇద్దరు నేతలు ఒక్కటి కావాలని కోరుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ఏకాభిప్రాయంతో వచ్చే అసంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒక్కరే పోటీలో ఉంటే బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థిని మట్టి కరిపించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్‌ బలంగా ఉంది. ఇక్కడి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ని ఓడించడం అనుకున్నంత సులువు కాదు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మర్రి ప్రజలతో మమేకమై పాలన సాగిస్తున్నారు. మర్రి ని ఢీ కొట్ట దానికి నాగం, కూచుకుల్ల ఒక్కటి అవుతారో లేదో వేచిచూడాలి.