Nagarjunasagar | మోడీ వైఫల్యంతోనే వరుస రైలు ప్రమాదాలు: శాసన మండలి చైర్మన్ గుత్తా

Nagarjunasagar విధాత: దేశంలో ఇటీవల జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వైఫల్యమే కారణమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. నాగార్జున సాగర్‌లో ఆయనఎమ్మెల్యే ఎన్‌.భాస్కర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడుతు ఫలక్‌నూమా ఎక్స్ ప్రెస్ రైలు లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడం సంతోషకరమన్నారు. అదే సమయంలో వరుస రైలు ప్రమాదాలు రైలు ప్రయాణీకుల భద్రతను ప్రశ్నార్ధకం చేస్తున్నాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. […]

Nagarjunasagar | మోడీ వైఫల్యంతోనే వరుస రైలు ప్రమాదాలు: శాసన మండలి చైర్మన్ గుత్తా

Nagarjunasagar

విధాత: దేశంలో ఇటీవల జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వైఫల్యమే కారణమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. నాగార్జున సాగర్‌లో ఆయనఎమ్మెల్యే ఎన్‌.భాస్కర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడుతు ఫలక్‌నూమా ఎక్స్ ప్రెస్ రైలు లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడం సంతోషకరమన్నారు.

అదే సమయంలో వరుస రైలు ప్రమాదాలు రైలు ప్రయాణీకుల భద్రతను ప్రశ్నార్ధకం చేస్తున్నాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. బాలసోర్ రైలు ప్రమాదంలో కేంద్రం మూడు వందల మందిని పొట్టన పెట్టుకుందన్నారు. మోదీ పాలనలో రైళ్లతో పాటు ప్రజాస్వామ్యానికి కూడా గడ్డు పరిస్థితి ఏర్పడిందన్నారు.

అధికార దాహంతో బీజేపీ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను పార్టీ పిరాయింపులకు ప్రోత్సహించి , అధికారాన్ని దక్కించుకుంటున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు. దేశములో జిడిపి రేటు పడిపోయిందని, దేశం అప్పుల ఉబిలో కూరుకుపోయిందన్నారు. 60 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వాలు అభివృద్ధి కోసం 57 వేల కోట్లు అప్పులు తీసుకువస్తే ,గడిచిన తొమ్మిది ఏండ్లల్లో బిజెపి ప్రభుత్వం 100 లక్షల కోట్ల అప్పులు తెచ్చిందని ఆ భారం ప్రజలపై నెట్టిందన్నారు.

మోదీ పాలనలో ప్రజలు అభివృద్ధి చెందలేదని , కేవలం ఆయన దోస్తులు, కార్పొరేట్ కంపెనీలు మాత్రమే వృద్ధి చెందాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర తగ్గిందని, కానీ మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదన్నారు. దీనితో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయన్నారు.

మోదీ ప్రజలను భ్రమలో పెట్టి, ప్రతిపక్ష లను చీల్చి ఏక సూత్ర విధానంతో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతున్నారన్నారు. సీబీఐ, ఈడీ , ప్రధాని కనుసన్నల్లో నడుస్తున్నాయన్నారు. వాళ్ళ మాటలు వినకపోతే దాడులు చేపిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంపైన కేంద్ర కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.

రాష్టానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. అన్యాయంగా సీలేరు పవర్ ప్రాజెక్టు ,ఏడు మండలాలను ఆంధ్రలో కలిపారన్నారు. రాష్ట్రానికి ఇస్తామన్న రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదన్నారు.

బీజేపీ, బిఆర్ యస్ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. బీఆర్ యస్ పార్టీ ఏనాడు బీజేపీతో కలిసి పోటీ చేయలేదన్నారు. గతములో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిందన్నారు. ఇంతకాలం చర్చకు రాని పౌర స్మృతి ఇప్పుడు ఎందుకు వస్తుందన్నారు.

ఎన్నికలు దగ్గరకు వచ్చిన ప్రతి సారి బిజెపి మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తుందన్నారు. బిజెపి పార్టీ మతతత్వ పార్టీ, బిఆర్ఎస్‌ పార్టీ లౌకికవాద పార్టీ అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి గా ఉన్నారన్నారు.