Nalgonda | 10 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత: SP అపూర్వరావు

Nalgonda విధాత: నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఇద్ధరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10లక్షల విలువైన 8 క్వింటాళ్ల 45 కిలోల ముడి పత్తి విత్తనాలు, 444 ప్యాకెట్లు (2 క్వింటాల్) మొత్తం 10 క్వింటాళ్ల 45 కిలోలను పట్టుకున్నట్లుగా జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. మునుగోడు ఎస్ఐ సతీష్ రెడ్డి, సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో మునుగోడు బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా ఎటువంటి ఆధారాలు […]

Nalgonda | 10 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత: SP అపూర్వరావు

Nalgonda

విధాత: నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఇద్ధరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10లక్షల విలువైన 8 క్వింటాళ్ల 45 కిలోల ముడి పత్తి విత్తనాలు, 444 ప్యాకెట్లు (2 క్వింటాల్) మొత్తం 10 క్వింటాళ్ల 45 కిలోలను పట్టుకున్నట్లుగా జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు.

మునుగోడు ఎస్ఐ సతీష్ రెడ్డి, సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో మునుగోడు బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా ఎటువంటి ఆధారాలు లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లను కలిగి ఉన్నారని గుర్తించారు. వెంటనే వ్యవసాయ అధికారులను పిలిపించి చెక్ చేయగా అవి నకిలీ విత్తనాలని తేలడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.

నిందితులు ఆంధ్ర‌ప్రదేశ్ కు చెందిన కర్నాటి మధుసూదన్ రెడ్డి, గురిజాల వీర బాబులు గత కొంత కాలంగా నంద్యాల పరిసర ప్రాంతాలలో రైతుల వద్ద నుండి తక్కువ ధరకు పత్తి విత్తనాలు కొని గుంటూర్ కు తరలించి, అక్కడ హరికృష్ణ రెడ్డి కి చెందిన పాత మిల్లు నందు వీర బాబుతో కలిసి ప్రాసెస్ చేస్తున్నారు.

తమ వద్ద ఉన్న విత్తనాలను గుర్తింపు లేని మేఘనా, అరుణోదయ కంపనీల పేరుతో పది ఫ్యాకెట్లలో ఫ్యాక్ చేసి గుంటూరు నుండి మునుగోడు కు తీసుకొని వచ్చి ఇక్కడ రైతులకు, డీలర్ లకు చూపించి అమ్మటానికి వ‌చ్చారు.

అలా ప్ర‌య‌త్నిస్తున్న‌క్ర‌మంల‌లో పట్టుకున్న‌ట్టు ఎస్పీ తెలిపారు. నిందితులు చెప్పిన వివరాల మేరకు హరి కృష్ణ రెడ్డి కి చెందిన పాత మిల్లు నుండి మిగిలిన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండుకు పంపినట్లు ఎస్పీ తెలిపారు.

గతంలో కర్నాటి మధుసూదన్ రెడ్డి నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడిన కేసుల్లో రెండు సార్లు పి.డి ఆక్ట్ నమోదు చేసి జైలుకి వెళ్ళి రావడం జరిగిందన్నారు. నల్లగొండ డీఎస్పీ ఆధ్వ‌ర్యంలో ఈ కేసును దర్యాప్తు చేసిన చండూర్ సిఐ అశోక్ రెడ్డి, మునుగోడు ఎస్ఐ సతీష్ రెడ్డి, కట్టంగూర్ ఎస్ఐ విజయ్, సిబ్బంది నాగరాజు, రామ నరసింహలను ఎస్పీ అభినందించారు.