Nalgonda
విధాత: ప్రజలను మభ్యపెట్టి మోసపు మాటలతో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి పరిపాలన సాగిస్తున్నారని మాజీమంత్రి సీఎల్పీ మాజీ నేత కే. జానారెడ్డి విమర్శించారు నల్లగొండ నిరుద్యోగ నిరసన సభలో ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ సాధనకు కీలకంగా వ్యవహరించిందన్నారు.
నల్లగొండ నాయకత్వం లేకపోతే ఇవాలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఉత్సాహం చూస్తే తిరిగి నల్గొండ జిల్లాలో 12 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే నమ్మకం ఏర్పడిందన్నారు. జిల్లా కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు ఉన్నా అవసరమైనఫుడు అందరం ఐక్యంగా పోరాడుతామన్నారు. అందుకు సంకేతమే ఈ వేదిక అన్నారు. ఇదే ఐక్యతను కొనసాగించి నలగొండ జిల్లా ప్రత్యేకతని రాష్ట్రంలో నిలబెట్టాలన్నారు.
ఢిల్లీ పురవీధుల్లో కూడా నల్గొండ జిల్లా కాంగ్రెస్ సత్తా చాటాలన్నారు. నాగార్జునసాగర్ వండే ప్రాజెక్టును నిర్మించి లక్షల ఎకరాలకు కాంగ్రెస్ నీళ్లు ఇచ్చింది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్తగా వేల ఎకరాలు కూడా సాగులోకి రాలేదన్నారు. కాంగ్రెస్ చేపట్టిన శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం మూలన పడేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని పూర్తి చేస్తామన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకుండా నియంతృత్వంగా అహంకారంగా వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 6000 మంది దళితులకు 30 లక్షల ఎకరాలను పంచిందని, నల్గొండ జిల్లాలో 2 లక్షల 45 ఎకరాలను పంచిందన్నారు. 45 లక్షల ఇళ్లను రాష్ట్రంలో పేదలకు కాంగ్రెస్ కట్టించింది అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో జిల్లాలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు.
ఎన్నికల ముందు మళ్ళీ మూడు లక్షల రూపాయలతో ఇల్లు మంజూరు చేస్తామని దరఖాస్తులతో మళ్ళీ ఎన్నికల్లో మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ లకు పథకాలు కుదించిపోగా ఇచ్చిన గొర్రెల పథకంలో ఒక గొర్రె కూడా కనిపించడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం లక్షల టన్నుల మాంసం ఎగుమతి చేస్తున్నట్లు అబద్ధాలు చెబుతుందన్నారు. చేసిన అప్పులతో రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కరికి 1,80,000 బాకీ అయింది అన్నారు.
తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే రైతుల రెండు లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. రైతు బంధు పేరుతో 5000 ఇస్తామని చెప్పి ఒక్కో కుటుంబం నుండి ఏడాదికి 50 వేల ఆదాయం ప్రభుత్వం రాబట్టుకుంటుందన్నారు. వ్యవసాయ కూలీలకు 12 ఆదాయం వచ్చే పథకం, గ్యాస్ 500, 2 లక్షల రుణమాఫీ వంటి పథకాలను కాంగ్రెస్ తేబోతుందన్నారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇస్తుందన్నారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టండి తిరిగి గెలిపించండి బిఆర్ఎస్ కు గుణపాఠం చెప్పండని జానా రెడ్డి కోరారు.