Nalgonda | R&R ప్యాకేజీ అమలు చేయండి: కలెక్టర్‌కు చర్లగూడెం నిర్వాసితుల వినతి
Nalgonda విధాత: చర్లగూడెం ప్రాజెక్టు నిర్మాణంతో ఇండ్లు, భూములు కోల్పోయిన తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పరిహారం ఇవ్వాలని కోరుతూ బాధిత నిర్వాసితులు బుధవారం నల్గొండ కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందించారు. తెలంగాణ భూ నిర్వాసితుల పోరాట సమితి ఆధ్వర్యంలో వారంతా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. 2013 భూసేకరణ చట్టం మేరకు పరిహార […]
Nalgonda
విధాత: చర్లగూడెం ప్రాజెక్టు నిర్మాణంతో ఇండ్లు, భూములు కోల్పోయిన తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పరిహారం ఇవ్వాలని కోరుతూ బాధిత నిర్వాసితులు బుధవారం నల్గొండ కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందించారు.

తెలంగాణ భూ నిర్వాసితుల పోరాట సమితి ఆధ్వర్యంలో వారంతా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. 2013 భూసేకరణ చట్టం మేరకు పరిహార పునరావాసాలు కల్పించాలని, 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ వర్తింపచేయాలన్నారు.
ప్రాజెక్ట్ పరంగా జరిగే అభివృద్ధి పనుల్లో స్థానికులకు అవకాశం కల్పించాలని కోరారు. ఇళ్ల స్థలాలను మర్రిగూడ మండలం వట్టిపల్లి రెవిన్యూ రాజపేట గ్రామపంచాయతీ పరిధిలో 250 గజాలు చొప్పున కేటాయించి ఇండ్ల నిర్మాణ వసతి కల్పించాలని కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram