Nalgonda | పీర్లబావిలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
Nalgonda మృతుల్లో బాలిక.. యువకుడు విధాత: నల్లగొండ(Nalgonda) జిల్లా దేవరకొండ పట్టణంలో ఆదివారం సంజయ్ కాలనీలో గల పీర్లబావిలో ఆదివారం ఈతకు వెళ్లి మేళ్ల జ్యోతి(14), నాగరాజు(25) నీటిలో మునిగి చనిపోయారు. మధ్యాహ్న సమయంలో పీర్లబావిలో జ్యోతి మరికొంతమంది పిల్లలతో కలిసి ఈత కొడుతున్న సమయంలో నాగరాజు కూడా ఈత కొట్టేందుకు బావిలో దిగాడు. ఈత కొడుతున్న జ్యోతిని కాలు లాగి నీటిలోకి తీసుకెళ్లడంతో జ్యోతితో పాటు లాక్కెళ్ళిన నాగరాజు నీటిలో మునిగి పోయారు. గమనించిన చుట్టుపక్కల […]

Nalgonda
- మృతుల్లో బాలిక.. యువకుడు
విధాత: నల్లగొండ(Nalgonda) జిల్లా దేవరకొండ పట్టణంలో ఆదివారం సంజయ్ కాలనీలో గల పీర్లబావిలో ఆదివారం ఈతకు వెళ్లి మేళ్ల జ్యోతి(14), నాగరాజు(25) నీటిలో మునిగి చనిపోయారు. మధ్యాహ్న సమయంలో పీర్లబావిలో జ్యోతి మరికొంతమంది పిల్లలతో కలిసి ఈత కొడుతున్న సమయంలో నాగరాజు కూడా ఈత కొట్టేందుకు బావిలో దిగాడు.
ఈత కొడుతున్న జ్యోతిని కాలు లాగి నీటిలోకి తీసుకెళ్లడంతో జ్యోతితో పాటు లాక్కెళ్ళిన నాగరాజు నీటిలో మునిగి పోయారు. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే వారిద్దరినీ బావి నుండి బయటికి తీసి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
బాలిక జ్యోతి ఎనిమిదో తరగతి చదువుతుండగా, నాగరాజు కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మృతురాలు తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.