NASA | నాసా అద్భుతం.. చెమ‌ట‌, మూత్రం నుంచి 98 శాతం మంచినీరు త‌యారీ

విధాత‌: మార్స్ (Mars) మీద‌కు పంప‌డానికి నాసా (NASA) సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. చంద్రుని మీదుగా వ్యోమ‌గాములు అంగార‌కుడి మీద‌కు వెళ్ల‌డానికి ఒక ఏడాదికి పైగా ప‌ట్టే అవ‌కాశ‌ముంది. ఇంత కాలం పాటు రాకెట్‌లో ఉన్న వారి అవ‌స‌రాల‌కు నీటిని పంపించాలంటే దాని కోసం భారీగా చోటును కేటాయించాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది అసాధ్యం. అందుకే వ్యోమ‌గాముల మూత్రం, చెమ‌టను మంచి నీటిగా మార్చే ప్ర‌క్రియ‌పై నాసా కొన్నేళ్లుగా ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతోంది. ఈ ప‌రిశోధ‌న‌ల్లో మంచి పురోగ‌తి […]

NASA | నాసా అద్భుతం.. చెమ‌ట‌, మూత్రం నుంచి 98 శాతం మంచినీరు త‌యారీ

విధాత‌: మార్స్ (Mars) మీద‌కు పంప‌డానికి నాసా (NASA) సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. చంద్రుని మీదుగా వ్యోమ‌గాములు అంగార‌కుడి మీద‌కు వెళ్ల‌డానికి ఒక ఏడాదికి పైగా ప‌ట్టే అవ‌కాశ‌ముంది. ఇంత కాలం పాటు రాకెట్‌లో ఉన్న వారి అవ‌స‌రాల‌కు నీటిని పంపించాలంటే దాని కోసం భారీగా చోటును కేటాయించాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది అసాధ్యం. అందుకే వ్యోమ‌గాముల మూత్రం, చెమ‌టను మంచి నీటిగా మార్చే ప్ర‌క్రియ‌పై నాసా కొన్నేళ్లుగా ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతోంది. ఈ ప‌రిశోధ‌న‌ల్లో మంచి పురోగ‌తి సాధించిన‌ట్లు నాసా తాజాగా ప్ర‌క‌టించింది.

ఎలా చేస్తారు?

రాకెట్లు, అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం (ISS) లో ఉండే ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్ అండ్ లైఫ్ స‌పోర్ట్ సిస్టమ్స్ (ఈసీఎల్ ఎస్ ఎస్‌) వ్య‌వ‌స్థ ద్వారా మూత్రాన్ని నీటిగా మార్చే ప్ర‌క్రియ జ‌రుగుతుంది. కేవలం నీటినే కాకుండా ఆహారం, గాలి మొద‌లైన వాటిని కూడా ఈ వ్య‌వ‌స్థ రీసైకిల్ చేయ‌గ‌ల‌దు. ఇందులో ఉండే వాట‌ర్ ప్రాసెసర్ అసెంబ్లీ (డ‌బ్ల్యూపీఏ)ను ప్ర‌త్యేకంగా మురికి నీటి నుంచి మంచి నీటిని త‌యారు చేయ‌డానికి ఏర్పాటుచేశారు.

దీనికి అనుబంధంగా ఉండే ఒక అత్యాధునిక డీహ్యుమిడిఫైర్.. వ్యోమ‌గాముల చెమ‌ట‌, శ్వాస‌క్రియ‌ల ద్వారా వ‌చ్చే తేమ‌ను సంగ్ర‌హిస్తుంది. వ్యోమ‌గామ‌ల మూత్రాన్ని శుద్ధిచేయ‌డానికి శాస్త్రవేత్త‌లు యూరిన్ ప్రాసెస‌ర్ అసెంబ్లీ (యూపీఏ) వ్య‌వ‌స్థ‌ను క‌నుగొన్నారు. వాక్యుమ్ డిస్టిలేష‌న్ ప‌ద్ధ‌తిలో ఇది యూరిన్‌ను సేక‌రించి శుద్ధి చేసి మంచినీటిగా మారుస్తుంది.

అయితే ఈ ప్ర‌క్రియ‌లో బ్రైన్ అనే ఉప‌యోగానికి ప‌నికిరాని నీరు కూడా ఉత్ప‌త్త‌వుతోంది. ఇక్క‌డే శాస్త్రవేత్త‌లు తాజాగా ముంద‌డుగు వేశారు. యూపీఏకు అనుబంధంగా బ్రైన్ ప్రాసెస‌ర్ అసెంబ్లీ (బీపీఏ)ను అభివృద్ధి చేసి ప‌రీక్షించారు. ఈ ప‌నికిరాని నీటిని కూడా బీపీఏ శుద్ధి చేయ‌గ‌లుగుతుండ‌టంతో.. వ్యోమ‌గాములు ఉప‌యోగించుకున్న నీటిలో 98 శాతాన్ని తిరిగి పొంద‌గ‌లిగారు.

ప్ర‌యోగానికి నాయ‌క‌త్వం వ‌హించిన క్రిస్టోఫ‌ర్ బ్రోన్ మాట్లాడుతూ… భ‌విష్యత్తు ప్ర‌యోగాల‌కు అడ్డంకిగా భావిస్తున్న ఓ పెద్ద స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికేసింద‌ని తెలిపారు. ఒక‌సారి ఊహించుకోండి.. మీరు 100 లీట‌ర్ల నీటిని తీసుకుని అంత‌రిక్షంలోకి వెళ్లార‌నుకుందాం.. మీరు దానిని శుద్ధి చేసుకోడం ద్వారా మ‌ళ్లీ మ‌ళ్లీ 98 లీట‌ర్ల నీటిని వాడుకోగ‌లిగితే అది ఎంత అద్భుతంగా ఉంటుందో అని వ్యాఖ్యానించారు.