Mumbai | వాట్సప్ డీపీలో ఔరంగజేబ్ ఫొటో.. వ్యక్తి అరెస్టు
విధాత: వాట్సప్ డీపీగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఫొటో పెట్టుకున్నాడనే ఆరోపణతో 29 ఏళ్ల వ్యక్తిని ముంబయి (Mumbai) పోలీసులు అరెస్టు చేశారు. అతడి చర్య శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనే కారణంతోనే ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక్కడి వశీ సెక్టార్‌లో అతడు శనివారం తన పని ప్రదేశంలో ఉండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 41 ఏ నోటీసు ఇచ్చి ఆదివారం మధ్యాహ్నం పంపించివేశారు. రైట్ వింగ్ యాక్టివిస్టు ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై […]

విధాత: వాట్సప్ డీపీగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఫొటో పెట్టుకున్నాడనే ఆరోపణతో 29 ఏళ్ల వ్యక్తిని ముంబయి (Mumbai) పోలీసులు అరెస్టు చేశారు. అతడి చర్య శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనే కారణంతోనే ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇక్కడి వశీ సెక్టార్‌లో అతడు శనివారం తన పని ప్రదేశంలో ఉండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 41 ఏ నోటీసు ఇచ్చి ఆదివారం మధ్యాహ్నం పంపించివేశారు.
రైట్ వింగ్ యాక్టివిస్టు ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఇటీవల కొల్హాపూర్, శంభాజీనగర్, అహ్మద్‌నగర్ లలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు యాక్టివిస్టు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. టిప్పు, జౌరంగజేబ్ ఫొటోలను వాట్సప్ స్టేటస్‌లుగా పెట్టుకోవడంతో ఆయా నగరాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే.