నయనతారనా మజాకానా.. 50 సెకండ్ల యాడ్ కోసం అంత డిమాండ్ చేస్తుందా?

లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్టార్ హీరోలని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ అమ్మడి సొంతం. పెళ్లయ్యాక కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. రీసెంట్‌గా జవాన్ అనే చిత్రంతో పెద్ద హిట్ కొట్టింది. స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ పోతున్న ఈ ముద్దుగుమ్మ తన కెరీర్‌లో భారీగానే సంపాదించింది. అత్యంత ధనికులైన నటీమణుల్లో నయనతార ఒకరని చెబుతుండగా, ఈ అమ్మడు ప్రతి సినిమాకి భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని టాక్. కొన్ని నివేదికల ప్రకారం 38 ఏళ్ల నయనతార 50 సెకన్ల యాడ్ కోసం రూ.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తాజాగా నెట్టింట ప్రచారం నడుస్తుంది.
2003లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నయనతార అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. సౌత్‌లో హయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. సినిమా ఇంటర్వ్యూలు, ఈవెంట్స్‌కి ఏ మాత్రం హాజరు కాని ఈ అమ్మడు సినిమాలలో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఒకవైపు కథానాయిక పాత్రలు, మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన నయనతార ఏకంగా రూ. 200 కోట్లు ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. సౌత్ ఇండస్ట్రీలో ప్రైవేట్ జెట్ ఉన్న ఏకైక హీరోయిన్ నయనతార మాత్రమే. అయితే నయనతార సినిమాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు యాడ్స్ లో కూడా నటిస్తూ సందడి చేస్తుంటుంది.
తాజాగా నయనతార 50 సెకండ్ల యాడ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందుకోసం ఆమె రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని తెలిసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ యాడ్ లెంగ్త్ పెరిగితే రూ.7 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు సదరు కంపెనీ సిద్ధంగా ఉందట. ఇన్నాళ్లు సౌత్‌లో సత్తా చాటిన నయనతార ఇప్పుడు జవాన్ మూవీతో బాలీవుడ్‌లో కూడా పాగా వేసింది. రానున్న రోజులలో అక్కడ కూడా చక్రం తిప్పాలని భావిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఏకంగా ఆరు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘పాట్టు’, ‘లేడీ సూపర్‌స్టార్ 75’, ‘ది టెస్ట్’, ‘ఇరైవన్’, ‘డియర్ స్టూడెంట్స్’, ‘తనీ ఒరువన్ 2’ చిత్రాలు చేస్తుంది.