Viral Video | NCC క్యాడెట్లను.. కర్రతో చితకబాదిన సీనియర్
Viral Video | ఎన్‌సీసీ క్యాడెట్ల పట్ల ఓ సీనియర్ అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఛాలెంజింగ్ డ్రిల్ సరిగ్గా చేయలేదన్న నెపంతో జూనియర్లపై సీనియర్ విరుచుకుపడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర థానేలోని బందోద్కర్ కాలేజీలో వెలుగు చూసింది. ఎన్‌సీసీ కార్యకలాపాల్లో భాగంగా ఓ సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్.. దాదాపు 8 మంది జూనియర్లకు శిక్షణ సమయంలో పుష్ అప్ పొజిషన్‌లో ఉంచి.. ఛాలెంజింగ్ డ్రిల్ ఇచ్చాడు. అయితే ఆ ఛాలెంజ్‌ను జూనియర్లు సరిగ్గా చేయలేకపోయారు. దీంతో వారిపై […]
Viral Video | ఎన్‌సీసీ క్యాడెట్ల పట్ల ఓ సీనియర్ అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఛాలెంజింగ్ డ్రిల్ సరిగ్గా చేయలేదన్న నెపంతో జూనియర్లపై సీనియర్ విరుచుకుపడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర థానేలోని బందోద్కర్ కాలేజీలో వెలుగు చూసింది.
ఎన్‌సీసీ కార్యకలాపాల్లో భాగంగా ఓ సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్.. దాదాపు 8 మంది జూనియర్లకు శిక్షణ సమయంలో పుష్ అప్ పొజిషన్‌లో ఉంచి.. ఛాలెంజింగ్ డ్రిల్ ఇచ్చాడు. అయితే ఆ ఛాలెంజ్‌ను జూనియర్లు సరిగ్గా చేయలేకపోయారు.
దీంతో వారిపై సీనియర్ విరుచుకుపడ్డాడు. వారి వీపులపై కర్రతో చితకబాడాడు. దెబ్బలు తాళలేక కొందరు విద్యార్థులు ఏడ్చేశారు. అయినప్పటికీ సీనియర్ కనికరించలేదు. ఈ ఘోరాన్ని కాలేజీ క్లాస్ రూం కిటికీలో నుంచి ఓ విద్యార్థి తన మొబైల్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ సుచిత్రా నాయక్ స్పందించారు. జూనియర్లపై సీనియర్ దాడి చేయడం హేయమైన చర్య.. ఇలాంటి ప్రవర్తనను సహించబోమని తేల్చిచెప్పారు. సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్‌పై చర్యలు తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించారు. గత 40 ఏళ్ల నుంచి కాలేజీలో ఎన్‌సీసీ ప్రోగ్రామ్‌లు జరుగుతన్నాయని, తమ కాలేజీకి మంచి పేరుందని ఆమె అన్నారు.
Shocking video of NCC students being brutally beaten up by seniors in Bandodkar and Joshi Bedekar College in Maharashtra’s #Thane@ThaneCityPolice @CMOMaharashtra @mieknathshinde @DrSEShinde pic.twitter.com/wHUm2YbciB
— Pranjal Mishra
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram