కొత్త జంట.. కాసేపట్లో రిసెప్షన్‌ అనగా రక్తపు మడుగులో

విధాత : ఇద్దరూ కోటి ఆశలతో కొత్త సంసారాన్ని మొదలు పెడదామనుకున్నారు. పెళ్లి అలసట ఇంకా తీరనే లేదు. సాయంత్రం అతిథులకు విందు ఏర్పాటు చేశారు. కానీ.. ఆ శుభకార్యం జరగడానికి ముందే ఇద్దరూ శవాలుగా మారారు. ఒంటి నిండా కత్తిపోట్లతో ఉన్న శవాలను పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ దారుణం చోటుచేసుకున్నది. నూతన వధూవరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని భార్యను కత్తితో పొడిచి చంపి, అనంతరం తాను కూడా […]

కొత్త జంట.. కాసేపట్లో రిసెప్షన్‌ అనగా రక్తపు మడుగులో

విధాత : ఇద్దరూ కోటి ఆశలతో కొత్త సంసారాన్ని మొదలు పెడదామనుకున్నారు. పెళ్లి అలసట ఇంకా తీరనే లేదు. సాయంత్రం అతిథులకు విందు ఏర్పాటు చేశారు. కానీ.. ఆ శుభకార్యం జరగడానికి ముందే ఇద్దరూ శవాలుగా మారారు. ఒంటి నిండా కత్తిపోట్లతో ఉన్న శవాలను పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ దారుణం చోటుచేసుకున్నది.

నూతన వధూవరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని భార్యను కత్తితో పొడిచి చంపి, అనంతరం తాను కూడా పొడుచుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అస్లాం (24), ఖక్షా బానో (22)కు ఆదివారం పెండ్లి జరిగింది.

మంగళవారం రాత్రి రిసెప్షన్‌ జరగాల్సి ఉన్నది. ఒక గదిలో వారిద్దరూ రెడీ అవుతున్న సమయంలో పెళ్లి కూతురు కేకలు వేయడం పెళ్లి కొడుకు తల్లి విన్నది. వెంటనే అక్కడకు పరుగెత్తి వెళ్లింది. ‘గది తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నది. వాళ్లు ఎంతకు తలుపు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు కిటికీ గుండా చూశారు.

అక్కడ రక్తపు మడుగులో ఇద్దరూ పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గది తలుపులు బద్దలు కొట్టి.. శవాలను పోస్టుమర్టం కోసం తరలించారు. గదిలో ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉంటుందని, ఆ ఆవేశంలో అతడు ఆమెను కత్తితో పొడిచి చంపి, అనంతరం తానూ పొడుచుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాధమికంగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.