Niharika | టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నిహారిక, చైతన్య జొన్నలగడ్డ.. రీసెంట్ గా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. దీంతో మెగా అభిమానులు చాలా బాధపడ్డారు. దీంతో నిహారిక, చైతన్యల లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. అసలు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందంటే.. నిహారిక తాత గారు, చైతన్య తాత గారు మంచి స్నేహితులు. అలా వీరిద్దరి ఫ్యామిలీలు ఫంక్షన్లకు, వేడుకలకు కలుస్తుండే […]
Niharika | టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నిహారిక, చైతన్య జొన్నలగడ్డ.. రీసెంట్ గా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. దీంతో మెగా అభిమానులు చాలా బాధపడ్డారు. దీంతో నిహారిక, చైతన్యల లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు.
అసలు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందంటే.. నిహారిక తాత గారు, చైతన్య తాత గారు మంచి స్నేహితులు. అలా వీరిద్దరి ఫ్యామిలీలు ఫంక్షన్లకు, వేడుకలకు కలుస్తుండే వారు. అలా చిరంజీవి, చైతన్య వాళ్ల నాన్నగారు కూడా మంచి ఫ్రెండ్స్.
ఇక నిహారిక, చైతన్యలు కూడా కలిసినప్పుడు మిగతావాళ్లను కలిసినట్టే.. హాయ్, బాయ్ వరకే పరిమితం అయ్యింది. కానీ ఒకసారి చైతన్య, నిహారికను చూసి ప్రపోజ్ చేశారట. అలా నిహారిక కూడా చైతన్య ప్రపోజ్ చేయడంతో షాక్ అయ్యిందట.
కానీ నిహారికకు కూడా చైతన్య అంటే ఇష్టం ఉండటంతో ఇంట్లో వాళ్లకు చెప్పడం.. వాళ్లు కూడా పెళ్లికి ఓకే చెప్పడంతో వీరిద్దరికీ ఎంగేజ్ మెంట్ అయ్యింది. ఆ తర్వాత కాబోయే భర్తతో నిహారిక పెళ్లికి ముందు మంచి హంగామానే చేశారు. ఇక 2020 డిసెంబర్ లో మెగా ఫ్యామిలీ దగ్గరుండి మరీ నిహారిక, చైతన్యల పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు.
పెళ్లి తర్వాత మాల్దీవులకు వెళ్లి ఫుల్ గా హానిమూన్ ను ఎంజాయ్ చేశారు. ఇక పెళ్లి దగ్గర్నుండి నిహారిక, చైతన్యల వివాహబంధం ఎంతో అన్యోన్యంగా సాగింది. నిహారిక, చైతన్యల ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఉండేది.
టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ గత సంవత్సర కాలం నుండి వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నిహారికను భర్త చైతన్య చాలా బాగా ప్రేమించే వారు. నిహారిక కూడా తండ్రి నాగబాబు దగ్గర ఎంత ప్రేమగా, ఫ్రీగా ఉండేవారో.. చైతన్య దగ్గర కూడా అంతే కంపర్టబుల్ గా ఉండేవారని అన్నారు.
మరి ఇంత ప్రేమగా ఉన్న వీరిద్దరు.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవడంతో మెగా అభిమానులు కూడా చాలా బాధపడ్డారు. ఏది ఏమైనా వీరిద్దరూ ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీగా మారిపోయారు.