Niharika: ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అంటే అది నిహారిక విడాకుల గురించే. గత కొన్నాళ్లు ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ నిహారిక, చైతన్యలు విడాకులు తీసుకుంటున్నారంటూ తెగ వార్తలు వచ్చాయి. దీనికి తోడు వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒకరికొకరు అన్ ఫాలో అవ్వడం, మ్యారేజ్ ఫోటోలు, వీడియోలో డిలీట్ చేయడం కూడా జరిగింది. ఇక జూలై 5 వ తేదీని నిహారిక, చైతన్యల వివాహ బంధం పూర్తిగా రద్దు […]
Niharika: ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అంటే అది నిహారిక విడాకుల గురించే. గత కొన్నాళ్లు ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ నిహారిక, చైతన్యలు విడాకులు తీసుకుంటున్నారంటూ తెగ వార్తలు వచ్చాయి.
దీనికి తోడు వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒకరికొకరు అన్ ఫాలో అవ్వడం, మ్యారేజ్ ఫోటోలు, వీడియోలో డిలీట్ చేయడం కూడా జరిగింది. ఇక జూలై 5 వ తేదీని నిహారిక, చైతన్యల వివాహ బంధం పూర్తిగా రద్దు అయినట్లు అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. వీరిద్దరి విడాకులు కన్ఫార్మ్ అంటూ నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ తో తేలిపోయింది.
ఇక ఇప్పుడు వీరిద్దరి విడాకుల విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరికి విడాకులు మంజూరు చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత కారణాలు, అభిప్రాయబేధాల వల్ల వీరిద్దరూ విడిపోయారనేది సమాచారం.
మరి నిహారిక తన భర్త నుండి భరణం కింద డబ్బులు డిమాండ్ చేస్తుందట. అది కూడా దాదాపు 100 కోట్లు భరణం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. కానీ నిజానికి నిహారిక తన భర్త చైతన్య నుంచి ఎలాంటి భరణం అవసరం లేదని చెప్పిందట. ఈ విషయంలో మెగా అభిమానులు నిహారిక డబ్బు మనిషి కాదని, తన కాళ్ల మీద తను నుంచోగలదని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే చైతన్యను ట్రోల్ చేస్తున్నారు.
మరికొంతమంది నెటిజన్లు మాత్రం చైతన్య, నిహారికలు విడాకులు తీసుకున్నారని.. ఇండస్ట్రీ నుంచి మరో క్యూట్ కపుల్ విడాకులు తీసుకున్నారని బాధ పడుతున్నారు. ఇక గతంలో భరణం విషయంలో సమంత, నాగ చైతన్య దగ్గర కోట్లల్లో డబ్బు తీసుకుంది అంటూ వార్తలు ప్రచారం చేశారు. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో సమంత తన మాజీ భర్త నాగచైతన్య దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపింది. అప్పటితో సమంతపై భరణం వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.