Niharika: వ‌ద్ద‌న్నా ఆ ప‌ని చేస్తున్న నిహారిక‌.. విడాకుల త‌ర్వాత ఇలా అయిందేంటి..!

Niharika: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక త‌న విడాకుల విష‌యంతో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. చైత‌న్య అనే వ్య‌క్తితో రాజ‌స్థాన్‌లో అట్ట‌హాసంగా పెళ్లి చేసుకున్న నిహారిక జూలై 5న త‌న విడాకుల విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. విడాకుల త‌ర్వాత నిహార‌కలో చాలా చేంజ్ వ‌చ్చింది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు బోల్డ్ లుక్స్ కి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ సంద‌డి చేస్తుంది. మ‌రోవైపు నిర్మాతగా […]

  • By: sn    latest    Jul 30, 2023 6:29 AM IST
Niharika: వ‌ద్ద‌న్నా ఆ ప‌ని చేస్తున్న నిహారిక‌.. విడాకుల త‌ర్వాత  ఇలా అయిందేంటి..!

Niharika: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక త‌న విడాకుల విష‌యంతో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. చైత‌న్య అనే వ్య‌క్తితో రాజ‌స్థాన్‌లో అట్ట‌హాసంగా పెళ్లి చేసుకున్న నిహారిక జూలై 5న త‌న విడాకుల విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. విడాకుల త‌ర్వాత నిహార‌కలో చాలా చేంజ్ వ‌చ్చింది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు బోల్డ్ లుక్స్ కి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ సంద‌డి చేస్తుంది. మ‌రోవైపు నిర్మాతగా మారి సినిమాలు నిర్మించడం ప్రారంభించింది. అంతేకాదు మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందని వార్త‌లు వ‌స్తున్నాయి. పెళ్లికి ముందు ఒక మ‌న‌సు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేయ‌గా, ఏ చిత్రం కూడా మంచి విజ‌యం అందించ‌లేకోయింది.

ఈ క్ర‌మంలో పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి దూరంగా ఉన్న ఈ అమ్మ‌డు ఇప్పుడు తిరిగి సినిమాలు చేయాల‌ని అనుకుంటుంద‌ట‌. . తన లో దాగి ఉన్న టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలని గట్టిగానే నిహారిక గ‌ట్టిగా ట్రై చేస్తుంద‌ని అంటున్నారు. ఇందులో భాగంగా యంగ్ డైరెక్టర్ తో కలిసి సినిమా చేసేందుకు ఒప్పుకుందట.ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి వివరాలు మాత్రం బయటకు రాలేదు, కాని నిహారిక సినిమా ఓకే చేసింద‌న్న విషయాన్ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. నిహారిక మళ్లీ సినిమా హీరోయిన్ గా రావడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదన్న వార్తలు కూడా నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయిజ‌

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తుండ‌గా, దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఇక నిహారిక.. డివొర్స్ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నానా ర‌చ్చ చేస్తుంది.విహార యాత్ర‌ల‌కి వెళుతూ అలానే ప‌లు ప్రాంతాల‌లో సంద‌డి చేస్తూ ర‌చ్చ చేస్తున్న నిహారిక హంగామాకి అవ‌ధులు లేవు. ఇక జొన్నలగడ్డ చైతన్య మాత్రం ఇటీవ‌ల పెద్ద‌గా ఎలాంటి పోస్ట్ చేయలేదు. త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా .’ఆల్ త్రీస్ ఇన్‌ స్టైల్‌’ అంటూ ఒక ఫొటో షేర్ చేశారు. ఆ ఫోటోలో సముద్రం, చెట్లు ఉండ‌గా, ఆహ్లాదకరమైన వాతావరణం క‌నిపిస్తుంది.