Nipah Virus | నిఫా వైరస్ కలకలం.. 24 వరకు విద్యాసంస్థలకు సెలవులు
Nipah Virus | కేరళలో నిఫా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రధానంగా కోజికోడ్ జిల్లాలో ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ట్యూషన్ సెంటర్లు కూడా నడపొద్దని ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఆన్‌లైన్ క్లాసులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ […]

Nipah Virus |
కేరళలో నిఫా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రధానంగా కోజికోడ్ జిల్లాలో ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ట్యూషన్ సెంటర్లు కూడా నడపొద్దని ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఆన్‌లైన్ క్లాసులకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. నిఫా పాజిటివ్ కేసుల సంఖ్య 6కు చేరుకుంది. ఇందులో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం నిఫా లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య 1,080కి చేరినట్లు పేర్కొన్నారు. ఇందులో 327 మంది హెల్త్ వర్కర్స్ ఉన్నట్లు ఆమె తెలిపారు.
నిఫా వైరస్‌తో ఆగస్టు 30న చనిపోయిన వ్యక్తి ద్వారా చాలా మంది ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అతని అంత్యక్రియలకు హాజరైన 17 మందిని ఐసోలేషన్‌లో ఉంచారు. ఇందులో ఒకరు పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు. నిఫా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు.