మిలిటరీ కాలేజీలో బాలికలకూ అడ్మిషన్లు
విధాత: రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ(ఆర్‌ఐఎంసీ)లో ఈ ఏడాది నుంచే బాలికలూ అడ్మిషన్ పొందేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.డిసెంబరు 18న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షను బాలికలూ రాసేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. 2022 జూన్ వరకు వేచి చూడకుండా.. ఈ ఏడాది నుంచే ప్రవేశపరీక్షకు బాలికలు హాజరయ్యేలా వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రెండు రోజుల్లో సవరించిన నోటిఫికేషన్‌ను ప్రచురించాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

విధాత: రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ(ఆర్‌ఐఎంసీ)లో ఈ ఏడాది నుంచే బాలికలూ అడ్మిషన్ పొందేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
డిసెంబరు 18న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షను బాలికలూ రాసేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. 2022 జూన్ వరకు వేచి చూడకుండా.. ఈ ఏడాది నుంచే ప్రవేశపరీక్షకు బాలికలు హాజరయ్యేలా వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రెండు రోజుల్లో సవరించిన నోటిఫికేషన్‌ను ప్రచురించాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.