Warangal | PG వైద్య తొలి విడత ప్రవేశాలకు.. కాళోజీ హెల్త్​ యూనివర్సిటీ నోటిఫికేష‌న్‌

Warangal | కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 13నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నిమ్స్‌తో పాటు కాళోజీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సీట్ల భర్తీ అభ్యర్థుల మెరిట్ జాబితా ఇప్పటికే విడుదల విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పీజీ వైద్య సీట్ల భర్తీకి ఈ నెల 13 నుంచి 15 వరకు మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్ […]

Warangal | PG వైద్య తొలి విడత ప్రవేశాలకు.. కాళోజీ హెల్త్​ యూనివర్సిటీ నోటిఫికేష‌న్‌

Warangal |

  • కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 13నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు
  • నిమ్స్‌తో పాటు కాళోజీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సీట్ల భర్తీ
  • అభ్యర్థుల మెరిట్ జాబితా ఇప్పటికే విడుదల

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పీజీ వైద్య సీట్ల భర్తీకి ఈ నెల 13 నుంచి 15 వరకు మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్ ఆప్షన్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

యూనివర్సిటీ పరిధిలోని పీజీ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 13 ఉదయం 8 గంటల నుంచి 15 వ తేదీన రాత్రి 8 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

మెరిట్ జాబితా అదేవిధంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్సైట్ లో పొందుపరిచారు మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ http://www.knruhs.telangana.gov.in ను చూడవలసిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.