Nithya Menon: తీవ్ర విషాదంలో స్టార్ హీరోయిన్.. ధైర్యం చెబుతున్న అభిమానులు
Nithya Menon: ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న భామ నిత్యా మీనన్. ఇటీవల తెలుగులో `భీమ్లా నాయక్` చిత్రంలో పవన్ కి జోడీగా నటించి అలరించింది. ఇక రెబల్ యాటిట్యూడ్‌తో కూడా మెప్పించింది. ప్రస్తుతం నిత్యామీనన్‌కి పెద్దగా అవకాశాలు లేవు. తెలుగు, తమిళంలో చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తున్న నిత్యా మీనన్.. వెబ్ సిరీస్‌లు చేస్తూ, పలు షోలకి జడ్జిగా వ్యవహరిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గ్లామర్ […]

Nithya Menon: ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న భామ నిత్యా మీనన్. ఇటీవల తెలుగులో ‘భీమ్లా నాయక్’ చిత్రంలో పవన్ కి జోడీగా నటించి అలరించింది. ఇక రెబల్ యాటిట్యూడ్‌తో కూడా మెప్పించింది.
ప్రస్తుతం నిత్యామీనన్‌కి పెద్దగా అవకాశాలు లేవు. తెలుగు, తమిళంలో చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తున్న నిత్యా మీనన్.. వెబ్ సిరీస్‌లు చేస్తూ, పలు షోలకి జడ్జిగా వ్యవహరిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గ్లామర్ షో చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా నిత్యా మీనన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
తనకి ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మ చనిపోవడంతో ఈ విషయాన్ని నిత్యా మీనన్ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది అమ్మమ్మ, తాతయ్యతో దిగిన ఫోటోని ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఆమె భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
‘ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్. ఇప్పట్నుంచి మరో కోణంలో చూసుకుంటా’ అని ఎమోషనల్ అయ్యింది నిత్యా మీనన్. అయితే ఆ ఫోటోలో నిత్యాని ప్రేమకి దగ్గరకి తీసుకుంది వాళ్ల అమ్మమ్మ. ఈ పిక్ చూస్తుంటే వారిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందనేది అర్దమవుతుంది.
తాను ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ లేకపోవడంతో నిత్యా మీనన్ తీవ్ర విషాదంలో మునిగి తేలుతుంది. ఈ క్రమంలో నెటిజన్స్ ధైర్యం చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనే గుండె రాయి చేసుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.
ఇక నిత్యా కెరీర్ విషయానికి వస్తే.. ‘అలా మొదలైంది’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నితిన్‌తో ‘ఇష్క్’తో పెద్ద హిట్ అందుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ‘గుండె జారిగల్లంతయ్యిందే’ చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా మారింది.
నిత్యా మీనన్… ‘జబర్దస్త్’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’, ‘ఒక అమ్మాయి తప్ప’, ‘జనతా గ్యారేజ్’, ‘అ!’, ‘గీత గోవిందం’, ‘గమనం’, ‘స్కైలాబ్’, ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.