హిందూ దేవుళ్లను కించపరిస్తే సహించం.. ఇదే బీజేపీ ఫత్వా

సోషల్ మీడియాలో హిందూ దేవతలను కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హెచ్చరించారు

  • By: Somu    latest    Apr 21, 2024 12:50 PM IST
హిందూ దేవుళ్లను కించపరిస్తే సహించం.. ఇదే బీజేపీ ఫత్వా

ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి
నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు

విధాత, హైదరాబాద్: సోషల్ మీడియాలో హిందూ దేవతలను కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో ప్రధాని మోదీ, అమిత్ షా, శ్రీరాముడి, సీతాదేవిలపై అభస్యకర పోస్టులు పెట్టాడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ, అమిత్ షా, శ్రీరాముడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వెనక కాంగ్రెస్ నేతల కుట్ర ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. హిందువుల జోలికి వస్తే సహించేది లేదని, ఇది బీజేపీ తరుపున ఫత్వా జారీగా భావించాలని కీలక వ్యాఖ్యలు చేశారు