ఇవే లాస్ట్‌.. ఇప్ప‌ట్లో పెద్ద సినిమాల విడుద‌ల‌ లేన‌ట్లే

  • By: sr    latest    Jan 22, 2025 4:16 PM IST
ఇవే లాస్ట్‌.. ఇప్ప‌ట్లో పెద్ద సినిమాల విడుద‌ల‌ లేన‌ట్లే

బాక్సాఫీస్ వ‌ద్ద సంక్రాంతి హంగామా ముగిసింది. మ‌రో మూడు నెల‌ల వ‌ర‌కు భారీ సినిమాలు థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మరో రెండు నెలల వరకు చెప్పుకోదగ్గ రిలీజులు కనిపించటం లేదు. అప్ప‌టివ‌ర‌కు ఒక‌టి రెండు మిన‌హా చెప్పుకోత‌గ్గ సినిమాలేవి లేవు.

మార్చి నెలాఖరు నుంచి సమ్మర్ సీజన్ మొద‌లై భారీ సినిమాల రిలీజ్ లు షెడ్యూల్ అయి ఉన్నాయి. అప్ప‌టివ‌ర‌కు ఈ రెండు మాసాలు మీడియం, స్మాల్ బడ్జెట్ సినిమాల విడుదలలే ఎక్కువగా ఉండనున్నాయి.

ఫిబ్రవరి తొలివారంలో పాన్ ఇండియా మూవీగా తండేల్ సినిమా రిలీజ్ ఉన్నా.. ఇంకా ఎలాంటి బజ్ వచ్చింది లేదు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే ఈ చిన్న సినిమాలలో.. కంటెంట్ ఏమాత్రం బాగున్నా.. పాజిటివ్ మౌత్ టాక్ తో వసూళ్లను అందుకునే అవకాశం ఉంటుంది‌. లాంగ్ రన్ కు ఛాన్స్‌ ఉంటుంది.

ఇక వీటితో పాటు నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌విల తండేల్‌ (Thandel), విష్వ‌క్ సేన్ లైలా (Laila), అజిత్ ప‌ట్టుద‌ల‌ (Pattudala), సందీప్ కిష‌న్ మ‌జాకా (Mazaka), కిర‌ణ్ అబ్బ‌వ‌రం దిల్ రుబా (Dilruba), ఆది పిని శెట్టి శ‌బ్ధం, ప్రియ‌ద‌ర్శి కోర్టు, రాజా గౌత‌మ్‌ బ్ర‌హ్మానందం (BrahmaAnandam) సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

ఇక ఆ త‌ర్వాత మార్చి నెల చివ‌ర‌కు రాబిన్ హుడ్‌, హ‌రిహ‌ర వీర‌మ‌ళ్లు వంటి భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆపై ప‌రీక్ష‌లు, ఐపీఎల్ నేప‌థ్యంలో సినిమాల విడుద‌ల‌లో చాలా మార్పులు జ‌రిగే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. సో అప్ప‌టివ‌ర‌కు మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలు, డ‌బ్బింగ్ సినిమాలు సినీల‌వ‌ర్స్‌కు దిక్కు కానున్నాయి.