Telangana Residentials | తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

Telangana Residentials | తెలంగాణ గురుకుల విద్యాసంస్థ‌లో 9,231 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ మేర‌కు గురుకుల విద్యాసంస్థ‌ల నియామ‌క బోర్డు 9 నోటిఫికేష‌న్లు జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ల ద్వారా డిగ్రీ( Degree College ), జూనియ‌ర్ కాలేజీ( Junior College )ల‌తో పాటు పీజీటీ( PGT ), టీజీటీ( TGT ), లైబ్ర‌రీయ‌న్స్, డ్రాయింగ్ టీచ‌ర్స్, క్రాఫ్ట్ టీచ‌ర్స్, మ్యూజిక్ టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అత్య‌ధికంగా 4020 టీజీటీ పోస్టుల‌ను( TGT […]

Telangana Residentials | తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

Telangana Residentials | తెలంగాణ గురుకుల విద్యాసంస్థ‌లో 9,231 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ మేర‌కు గురుకుల విద్యాసంస్థ‌ల నియామ‌క బోర్డు 9 నోటిఫికేష‌న్లు జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ల ద్వారా డిగ్రీ( Degree College ), జూనియ‌ర్ కాలేజీ( Junior College )ల‌తో పాటు పీజీటీ( PGT ), టీజీటీ( TGT ), లైబ్ర‌రీయ‌న్స్, డ్రాయింగ్ టీచ‌ర్స్, క్రాఫ్ట్ టీచ‌ర్స్, మ్యూజిక్ టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది.

అత్య‌ధికంగా 4020 టీజీటీ పోస్టుల‌ను( TGT Posts ) భ‌ర్తీ చేస్తున్న‌ట్లు నోటీఫికేష‌న్‌లో పేర్కొన్నారు. పీజీటీ పోస్టులు( PGT Posts ) 1276 భ‌ర్తీ చేయ‌నున్నారు. జూనియ‌ర్ కాలేజీల్లో 2008 లెక్చ‌ర‌ర్స్, ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్( Physical Director ), లైబ్ర‌రీయ‌న్ పోస్టుల‌కు( Librarian Posts ) నోటిఫికేష‌న్ వెలువ‌డింది. డిగ్రీ కాలేజీల్లో 868 లెక్చ‌ర‌ర్స్, ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్, లైబ్ర‌రీయ‌న్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది.

గురుకుల పాఠ‌శాల‌ల్లో 434 లైబ్ర‌రీయ‌న్స్, 275 ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్స్, 134 డ్రాయింగ్ టీచ‌ర్స్, 92 క్రాఫ్ట్ టీచ‌ర్స్, 124 మ్యూజిక్ టీచ‌ర్స్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు ఈ నెల 12వ తేదీ నుంచి వ‌న్ టైం రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు. 17వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. తదిత‌ర వివ‌రాల కోసం www.treirb.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.