మే 3దాకా అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
విధాత: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు శుభవార్త. అర్హత ఉన్న సభ్యులంతా మే 3దాకా అధిక పెన్షన్ (HIGHER PENSION)ను ఎంచుకోవచ్చు. తమ యాజమాన్యాలతో కలిసి అధిక పింఛన్ కోసం ఈపీఎఫ్‌వో యూనిఫైడ్ మెంబర్స్ పోర్టల్‌పై దరఖాస్తు చేసుకోవచ్చు. అధిక పెన్షన్‌కు ఉద్యోగి (EMPLOYE)తోపాటు తను పనిచేస్తున్న సంస్థ (EMPLOYER)కూడా అంగీకరించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. కాగా, ఇంతకముందు మార్చి 3 వరకే ఈ గడువు ఉండేది. ఈ క్రమంలోనే రెండు నెలలు పొడిగించారు. […]

విధాత: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు శుభవార్త. అర్హత ఉన్న సభ్యులంతా మే 3దాకా అధిక పెన్షన్ (HIGHER PENSION)ను ఎంచుకోవచ్చు. తమ యాజమాన్యాలతో కలిసి అధిక పింఛన్ కోసం ఈపీఎఫ్‌వో యూనిఫైడ్ మెంబర్స్ పోర్టల్‌పై దరఖాస్తు చేసుకోవచ్చు. అధిక పెన్షన్‌కు ఉద్యోగి (EMPLOYE)తోపాటు తను పనిచేస్తున్న సంస్థ (EMPLOYER)కూడా అంగీకరించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే.
కాగా, ఇంతకముందు మార్చి 3 వరకే ఈ గడువు ఉండేది. ఈ క్రమంలోనే రెండు నెలలు పొడిగించారు. ఈపీఎఫ్‌వో యూనిఫైడ్ మెంబర్స్ పోర్టల్‌పై ఇటీవలే యాక్టివేట్ చేసిన URLలో మే 3దాకా అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న సమాచారం ఉన్నది.
గత ఏడాది నవంబర్ 4న సుప్రీం కోర్టు (SUPREME COURT).. అర్హత ఉన్న ఉద్యోగులకు అధిక పెన్షన్‌ను ఎంచుకునే అవకాశం నాలుగు నెలలపాటు ఇవ్వాలని ఈపీఎఫ్‌వోకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువు వచ్చే నెల 3తో ముగియనున్నది.
దీంతో ఇప్పుడు మే 3దాకా పెంచారు. ఇప్పటికే అధిక పెన్షన్‌కు సంబంధించి ఈపీఎఫ్‌వో అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించిన సంగతి విదితమే. అర్హతలతోపాటు ఎలా దరఖాస్తు చేయాలి, అందుకు ఏమేం చేయాలన్నదానిపై స్పష్టతను ఇచ్చింది.