Toll Plaza | ఇక టోల్‌ప్లాజాల వద్ద ఆగక్కర్లేదు!
Toll Plaza | విధాత: ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త టోల్ విధానం తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. టోల్‌ప్లాజాల వద్ద ఆగడం, ఫాస్టాగ్ స్కాన్ చేయించుకోవడం వంటి వాటితో నిమిత్తం లేకుండా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు ట్రయల్స్ జరుగుతున్నాయని, అవి విజయవంతమైన వెంటనే ఆ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఈ విధానంలో టోల్‌ప్లాజా వద్ద కెమెరా, వాహన రిజిస్ట్రేషన్ […]

Toll Plaza |
విధాత: ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త టోల్ విధానం తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. టోల్‌ప్లాజాల వద్ద ఆగడం, ఫాస్టాగ్ స్కాన్ చేయించుకోవడం వంటి వాటితో నిమిత్తం లేకుండా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.
ఈ మేరకు ట్రయల్స్ జరుగుతున్నాయని, అవి విజయవంతమైన వెంటనే ఆ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.
ఈ విధానంలో టోల్‌ప్లాజా వద్ద కెమెరా, వాహన రిజిస్ట్రేషన్ నంబరును స్కాన్ చేసి సమాచారాన్ని సేకరిస్తుంది. అక్కడి నుంచి ప్రయాణించిన దూరాన్ని బట్టి రుసుమును వసూలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ విధానంతో టోల్‌ప్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు. ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఉపగ్రహం, కెమెరాల ఆధారంగా పనిచేసే ఈ నూతన విధానాన్ని ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్ వేలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.