Missouri | నాలుగేళ్లైనా చెక్కుచెదరని నన్ మృతదేహం.. దేవుని మహిమ అంటున్న ప్రజలు
విధాత: నాలుగేళ్లయినా చెక్కుచెదరకుండా ఉన్న నన్ మృతదేహాన్ని దర్శించుకోడానికి అమెరికాలోని మిసౌరీ (Missouri) నగరానికి ప్రజలందరూ క్యూ కడుతున్నారు. ఓ క్రైస్తవ మత సంస్థకు వ్యవస్థాపకురాలైన సిస్టర్ విల్‌హెల్మినా లాంకాస్టర్ అనే నన్ 2019లో మరణించారు. అనంతరం ఆవిడ మృతదేహాన్ని శవపేటికలో భద్రపరిచి మిసౌరీలోని శ్మశానంలో కప్పెట్టారు. అయితే ఆ ఎముకలను చర్చిలో భద్రపరచాలని భావించిన చర్చి అధికారులు.. ఈ ఏడాది మే 18న ఆమె మృతదేహం ఉన్న శవపేటికను బయటకు తీసి దానిని తెరిచి చేడగా […]

విధాత: నాలుగేళ్లయినా చెక్కుచెదరకుండా ఉన్న నన్ మృతదేహాన్ని దర్శించుకోడానికి అమెరికాలోని మిసౌరీ (Missouri) నగరానికి ప్రజలందరూ క్యూ కడుతున్నారు. ఓ క్రైస్తవ మత సంస్థకు వ్యవస్థాపకురాలైన సిస్టర్ విల్‌హెల్మినా లాంకాస్టర్ అనే నన్ 2019లో మరణించారు. అనంతరం ఆవిడ మృతదేహాన్ని శవపేటికలో భద్రపరిచి మిసౌరీలోని శ్మశానంలో కప్పెట్టారు.
అయితే ఆ ఎముకలను చర్చిలో భద్రపరచాలని భావించిన చర్చి అధికారులు.. ఈ ఏడాది మే 18న ఆమె మృతదేహం ఉన్న శవపేటికను బయటకు తీసి దానిని తెరిచి చేడగా వారి కళ్లను వారే నమ్మలేక పోయారు. వారు పూడ్చిపెట్టినపుడు ఎలా ఉందో లాంకాస్టర్ మృతదేహం ఇప్పుడూ అలానే ఉంది. చనిపోయి నాలుగేళ్లు అయింది కాబట్టి శరీరం ఛిద్రమై ఎముకలే ఉండాలని కానీ సిస్టర్ శరీరం ఎలా పూడ్చిపెట్టామో అలానే ఉందని బిషప్ జాన్‌స్టన్ తెలిపారు.
అయితే క్యాథలిక్ రికార్డుల ప్రకారం ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు 100 జరిగాయని క్యాథలిక్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. వీరందరిలో సిస్టర్ లాంకాస్టర్ మొదటి ఆఫ్రికన్ అమెరికన్ నన్ అని తెలిపింది. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకడంతో ఈ ఘటనను దైవ కృపగా భావించి క్యాథలిక్కులు పెద్ద సంఖ్యలో మృతదేహాన్ని సందర్శించడానికి వస్తున్నారు.
పెద్ద వింతేమీ కాదు..
ఈ ఘటనపై వైద్యులు స్పందించారు. కొన్ని మృతదేహాలు లేపనాలు పూయకపోయినా ఐదారేళ్ల వరకు డీకంపోజ్ అవ్వకుండా ఉంటాయని తెలిపారు. మానవ శరీరం పూర్తి స్థాయిలో ఎముకల గూడుగా మారడానికి ఐదారేళ్ల సమయం పడుతుందని ఫోరెన్సిక్ నిపుణుడు నికోలస్ స్పష్టం చేశారు. కాబట్టి ఈ నన్ ఉదంతం తనకు ఆశ్చర్యాన్నేమీ కలిగించలేదని ఆయన అన్నారు.