పెండ్లి కాకున్నా పిల్లల్ని కలిగి ఉండొచ్చు!
ఓకే చెప్పిన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ విధాత: ఒకప్పడు జనాభాను తగ్గించడంపై ఫోకస్ పెట్టిన చైనా.. ఇప్పుడు జనాభా సంఖ్య పెరిగేందుకు ఎన్ని ఏ అవకాశం ఉన్నా వదులుకోవడం లేదు. ప్రపంచ ఆర్థిక సూపర్ పవర్‌గా ఎదుగాలని ఉవ్విళ్లూరుతున్న చైనాకు జనాభా తగ్గుదల ప్రతిబంధకంగా మారుతుందని చైనా నేతలు భయపడుతున్నారు. గతంలో అమలు చేసిన కఠిన నిర్ణయాల మూలంగానే ఈ దుస్థితి వచ్చిందని నాలుక కర్చుకుంటున్నది. అందుకే గత కొన్నాళ్లుగా జనాభా పెరుగుదలకు అనేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నారు. […]

- ఓకే చెప్పిన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్
విధాత: ఒకప్పడు జనాభాను తగ్గించడంపై ఫోకస్ పెట్టిన చైనా.. ఇప్పుడు జనాభా సంఖ్య పెరిగేందుకు ఎన్ని ఏ అవకాశం ఉన్నా వదులుకోవడం లేదు. ప్రపంచ ఆర్థిక సూపర్ పవర్‌గా ఎదుగాలని ఉవ్విళ్లూరుతున్న చైనాకు జనాభా తగ్గుదల ప్రతిబంధకంగా మారుతుందని చైనా నేతలు భయపడుతున్నారు.
గతంలో అమలు చేసిన కఠిన నిర్ణయాల మూలంగానే ఈ దుస్థితి వచ్చిందని నాలుక కర్చుకుంటున్నది. అందుకే గత కొన్నాళ్లుగా జనాభా పెరుగుదలకు అనేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటిదాకా అమలులో ఉన్న సింగిల్ చైల్డ్ విధానాన్ని ఎత్తివేశారు. అయినా జననాల రేటులో పెద్దగా పురోగతి కనిపించక పోవటంతో కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే చైనాలో ప్రముఖ ప్రావిన్స్ అయిన సిచువాన్ ఓ అడుగు ముందుకేసి పెండ్లి కాకున్నా పిల్లలను కలిగి ఉండొచ్చు అని ప్రకటించింది. ఎవరైనా వ్యక్తులు తమకు పిల్లలు కావాలనుకుంటే… పిల్లలను కలిగి ఉండేందుకు అవకాశం ఉన్నదని, దానికి ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేయించుకొంటే సరిపోతుందని సిచువాన్ యంత్రాంగం తెలిపింది.
ఇలా పెండ్లి కాకున్నా పిల్లలను కలిగి ఉండాలనుకొనే వారికి.. పెండ్లైన కుటుంబాలకు ఉండే అన్ని సౌకర్యాలు ఉంటాయిని తెలియజేసింది. అలాగే ఎంతమందినైనా పిల్లలను కలిగి ఉండవచ్చని పేర్కొన్నది. అయితే.. సిచువాన్ నిర్ణయంపై చైనాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో పిల్లల్ని కలిగి ఉండే హక్కు అవివాహితులకు ఉన్నదని చెప్పామే కానీ, పెండ్లి కాకుండా పిల్లల్ని కనాలని చెప్పలేదని సిచువాన్ యాంత్రాంగం వివరణ ఇచ్చుకున్నది.
ఈ మధ్య కాలంలోనే చైనా మొదటి సారి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా గుర్తింపు కోల్పోయింది. గత జనవరి 17న ప్రకటించిన నివేదిక ప్రకారం చైనాలో 2022 సంవత్సరంలో 95.6 లక్షల జననాలు ఉంటే, 1.5 కోట్ల మరణాలున్నాయి. జననాలకన్నా మరణాలు ఎక్కువగా ఉండటం గత ఆరేండ్లుగా కొనసాగుతున్నది.
ఇప్పటికే చైనా మొత్తం జనాభాలో వృద్ధుల శాతం ఎక్కువగా ఉన్నది. తాజా పరిణామాలతో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నది. నానాటికీ యువత కనిష్ఠ స్థాయికి పడిపోతే.. ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రధానంగా వస్తూత్పత్తి, ఎగుమతులపైనే ఆధారపడిన చైనాలో మానవ వనరులు అత్యవసరం. అందుకే.. చైనా ఇప్పటిదాంకా జనాభా నియంత్రణకు అవలంబించిన విధానాలన్నింటినీ ఎత్తివేసి గంపెడు మంది సంతానంతో వర్థిల్లండంటూ యువతను ఆశీర్వదిస్తున్నది.