High Court | దళితబంధు పథకంపై.. హైకోర్టులో పిల్ దాఖలు
High Court | ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ఉన్నత ధర్మాసనం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా విధాత, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన దళితబంధు ప్రథకంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పథకంలో అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండ కూడదని, వారి పిఫార్సు మేరకే దళిత బంధు అర్హులను ఎన్నుకోవడం రాజ్యంగ విరుద్ధమని పిల్‌లో పేర్కొన్నారు. దీనిపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం […]

High Court |
- ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ఉన్నత ధర్మాసనం
- తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
విధాత, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన దళితబంధు ప్రథకంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పథకంలో అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండ కూడదని, వారి పిఫార్సు మేరకే దళిత బంధు అర్హులను ఎన్నుకోవడం రాజ్యంగ విరుద్ధమని పిల్‌లో పేర్కొన్నారు. దీనిపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దళితబంధు అర్హులను ప్రభుత్వం ఎంపిక చేస్తుందని పిటిషనర్ తరుఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ న్యాయస్థానానికి సూచించారు. దళిత బంధు పథకంతో ఒక్కో కుటుంబానికి పదిలక్షల రూపాయాలు (రూ.10,00,000) ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు.
అయితే ప్రతీ నియోజకవర్గంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తమ అనుచరులకు మాత్రమే వారు దళిత బంధు వచ్చేలా చూస్తున్నారని, వారి పేర్లను మాత్రమే నమోదు చేస్తున్నారని ఇది రాజ్యంగ విరుద్ధమని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా అక్కడున్న ప్రజాప్రతినిధులు తమకు కావాల్సిన వారికి మాత్రమే దళిత బంధు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని ధర్మాసనానికి సూచించారు. ఎలాంటి అవకతవకలు జరుగకుండా కాకుండా ప్రతీ నియోజక వర్గం నుంచి 1100 మంది దళిత కుటుంబాలకు ఆ పథకం కింద రూ.10,00,000 లక్షలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు పారదర్శకత పాటించడం లేదని తెలిపారు. కొన్ని నియోజకవర్గాలు, మండలాల్లో దళితబంధు విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆయా నియోజకవర్గాలు, మండలాల్లో ఒక్కో దళిత కుటుంబానికి రూ. పది లక్షలు వస్తే అందులోంచి రూ.2 నుంచి 3 లక్షలు ప్రజాప్రతినిధులు కమీషన్ రూపంలో తీసుకుంటున్నారని, అది తమ దృష్టికి వచ్చిందని స్వయంగా రాష్ర్ట ముఖ్యమంత్రి ఇటీవల ఓ సమామేశంలో చెప్పినట్లు న్యాయస్థానానిక గుర్తు చేశారు.
అలా తీసుకున్న వారి పేర్లను నమోదుచేసుకుంటున్నామని వచ్చే ఎన్నికల్లో వారికి బీం ఫాం ఇవ్వమని కూడా హెచ్చరించినట్లు తెలిపారు. అలా జరుగకుండా ప్రతి దళిత కుటుంబానికి రూ. పది లక్షలు అందేలా చర్యలు తీసుకోవాలని గౌరవ న్యాయస్థానాన్ని పిటిషనర్ తరుఫు న్యాయవాది కోరారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం తెలంగాణ రాష్ర్టం ప్రధాన కార్యదర్శి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.