Khalistan |
న్యూఢిల్లీ: హోంశాఖ మంత్రి అమిత్‌షా, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ల విదేశీ పర్యటనల సమాచారం ఇచ్చిన వారికి కోటి రూపాయల రివార్డును ఇస్తామని ఖలిస్తాన్ ఉగ్రవాది గరుపత్వంత్ సింగ్ పన్ను ప్రకటించడం సంచలనం రేపింది. వీరే కాకుండా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పై కూడా ఈ రివార్డు వర్తిస్తుందని సదరు ఉగ్రవాది తెలిపారు.
కెనాడాలోని వాంకోవర్‌లో గత జూన్‌లో తమ నాయకుడైన హరిదీప్ సింగ్ నిజ్జర్ ఎన్‌కౌంటర్‌కు వీరే బాధ్యులని, దానికి ప్రతీకారంగా ఈ రివార్డును వీరిపై ప్రకటిస్తున్నామని వెల్లడించాడు. సమాచారం ఇచ్చి వారి వివరాలను కూడా రహస్యంగా ఉంచుతామని తెలిపారు.