Mexico | మెక్సికోలో మండుతున్న ఎండ‌లు.. వ‌డ‌గాలుల‌కు 100 మందికి పైగా మృతి

Mexico | మెక్సికోలో ఎండ‌లు మండిపోతున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు జ‌నాలు విల‌విల‌లాడిపోతున్నారు. వ‌డ‌గాలుల‌కు జ‌నాలు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. రెండు వారాల వ్య‌వ‌ధిలో 100 మందికి పైగా మృతి చెందారు. మెక్సికోలోని ప‌లు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 50 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. విద్యార్థుల‌కు త‌ర‌గ‌తుల‌ను ర‌ద్దు చేశారు. ఉక్క‌పోత నేప‌థ్యంలో క‌రెంట్ వినియోగం భారీగా పెరిగింది. ఏసీలు, ఫ్యాన్లు లేకుండా జ‌నాలు ఉండలేక‌పోతున్నారు. గ‌త మూడు వారాల […]

  • Publish Date - June 30, 2023 / 12:24 AM IST

Mexico | మెక్సికోలో ఎండ‌లు మండిపోతున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు జ‌నాలు విల‌విల‌లాడిపోతున్నారు. వ‌డ‌గాలుల‌కు జ‌నాలు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. రెండు వారాల వ్య‌వ‌ధిలో 100 మందికి పైగా మృతి చెందారు.

మెక్సికోలోని ప‌లు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 50 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

విద్యార్థుల‌కు త‌ర‌గ‌తుల‌ను ర‌ద్దు చేశారు. ఉక్క‌పోత నేప‌థ్యంలో క‌రెంట్ వినియోగం భారీగా పెరిగింది. ఏసీలు, ఫ్యాన్లు లేకుండా జ‌నాలు ఉండలేక‌పోతున్నారు.

గ‌త మూడు వారాల నుంచి ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంద‌ని అధికారులు పేర్కొన్నారు. జూన్ 18 నుంచి 24వ తేదీ మ‌ధ్య‌లోనే 100 మంది చ‌నిపోయిన‌ట్లు తెలిపారు. గ‌తేడాది ఇదే స‌మ‌యంలో వ‌డ‌గాలుల‌కు ఒక‌రు మాత్ర‌మే మ‌ర‌ణించార‌ని అధికారులు గుర్తు చేశారు.

Latest News