కండోమ్స్ అధికంగా వాడేది ముస్లింలే.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
విధాత: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై నిప్పులు చెరుగుతూనే.. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కండోమ్స్ అధికంగా వాడేది ముస్లింలే అని ఆయన తేల్చేశారు. హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీ నిర్వహించిన ఓ సమావేశంలో ఓవైసీ ప్రసంగించారు. దేశంలో మతపరమైన అసమానతలు పెరిగి పోతున్నాయని, జనాభా అడ్డు అదుపు లేకుండా పెరగడంతో.. మతపరమైన సమతౌల్యం దెబ్బతిన్నదని, దీని నియంత్రణపై దృష్టి సారించాలని మోహన్ భగవత్ సూచించారు. ఇందు కోసం జనాభా నియంత్రణ […]

విధాత: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై నిప్పులు చెరుగుతూనే.. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కండోమ్స్ అధికంగా వాడేది ముస్లింలే అని ఆయన తేల్చేశారు. హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీ నిర్వహించిన ఓ సమావేశంలో ఓవైసీ ప్రసంగించారు.
దేశంలో మతపరమైన అసమానతలు పెరిగి పోతున్నాయని, జనాభా అడ్డు అదుపు లేకుండా పెరగడంతో.. మతపరమైన సమతౌల్యం దెబ్బతిన్నదని, దీని నియంత్రణపై దృష్టి సారించాలని మోహన్ భగవత్ సూచించారు. ఇందు కోసం జనాభా నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఇవాళ ఓవైసీ నిప్పులు చెరిగారు. దేశ జనాభా గురించి ఆందోళన చెందుతున్న మోహన్ భగవత్‌కు చురకలంటించారు. దేశంలో కండోమ్స్ అధికంగా వినియోగించేది ముస్లింలేననే వాస్తవం గురించి ఆయన ఎన్నడూ మాట్లాడారని ఓవైసీ విమర్శించారు.
ముస్లింల జనాభా పెరగడం లేదు.. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముస్లింల జనాభా రోజు రోజుకి తగ్గిపోతుందని ఓవైసీ పేర్కొన్నారు. ఈ దేశంలోని ముస్లింలు.. ఆర్ఎస్ఎస్, బీజేపీ దయ వల్ల బతకడం లేదని, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఆధారంగా బతుకుతున్నారని ఓవైసీ స్పష్టం చేశారు.