Owl | విధాత: కొన్ని సార్లు జంతువులు, పక్షులు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుని సాయం కోసం అర్థిస్తుంటాయి. ఎవరైనా మంచి మనసున్న మనుషుల కంట అలాంటి జీవులు కనిపిస్తే కాపాడటం చూస్తూనే ఉంటాం. హత్యలు, అత్యాచారాలతో కలతపడిన గుండెను తేలిక పరిచే వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. చెట్టు కొమ్మకి వేలాడుతున్న ఒక వైరు లాంటి దాంట్లో గుడ్లగూబ (owl) కాలు ఇరుక్కు పోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. పైగా అది పారుతున్న వాగుపై వేలాడుతుండటంతో. . ముందు […]
Owl |
విధాత: కొన్ని సార్లు జంతువులు, పక్షులు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుని సాయం కోసం అర్థిస్తుంటాయి. ఎవరైనా మంచి మనసున్న మనుషుల కంట అలాంటి జీవులు కనిపిస్తే కాపాడటం చూస్తూనే ఉంటాం.
హత్యలు, అత్యాచారాలతో కలతపడిన గుండెను తేలిక పరిచే వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. చెట్టు కొమ్మకి వేలాడుతున్న ఒక వైరు లాంటి దాంట్లో గుడ్లగూబ (owl) కాలు ఇరుక్కు పోయినట్లు వీడియోలో కనిపిస్తోంది.
పైగా అది పారుతున్న వాగుపై వేలాడుతుండటంతో. . ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న పరిస్థితుల్లో పడింది. ప్రాణభీతితో సాయం కోసం ఆ గుడ్లగూబ అరుస్తున్నప్పటికీ.. అది అడవి కావడం వల్ల దాని అరుపు అరణ్యరోదనే అయింది.