ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి.. డిప్యూటీ సీఎం భట్టికి పద్మశ్రీ మొగిలయ్య వినతి

పద్మశ్రీ అవార్డు గ్రహీత ద‌ర్శనం మొగిల‌య్య రాష్ట్ర స‌చివాల‌యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మంగళవారం మ‌ర్యాద పూర్వకంగా కలిశారు

  • By: Somu    latest    Feb 27, 2024 10:34 AM IST
ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి.. డిప్యూటీ సీఎం భట్టికి పద్మశ్రీ మొగిలయ్య వినతి

విధాత : పద్మశ్రీ అవార్డు గ్రహీత ద‌ర్శనం మొగిల‌య్య రాష్ట్ర స‌చివాల‌యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మంగళవారం మ‌ర్యాద పూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం నెల‌కు రూ.25వేల ఫించ‌న్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వ‌చ్చే మార్చి నెల నుంచి ఫించ‌న్ ఇప్పించాల‌ని కోరారు. అలాగే నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా లింగాల మండ‌లం అవుసుల కుంట గ్రామంలో త‌న‌కు ఇందిర‌మ్మ ఇల్లు మంజూరు చేయాల‌ని కోరారు. అనంతరం బీమ్లా నాయ‌క్ సినిమాలో రాసిన పాట‌ను భట్టికి తన 12మెట్ల కిన్నెరను వాయిస్తూ మొగిలయ్య పాడి వినిపించారు.