Hyderabad | 14వ తేదీన హైద‌రాబాద్‌లో పార్కులు, రెస్టారెంట్లు మూసివేత‌..!

Hyderabad | ఈ నెల 14వ తేదీన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ప‌రిధిలోని అన్ని పార్కులు, రెస్టారెంట్ల‌ను మూసివేస్తున్న‌ట్లు హెచ్ఎండీఏ ప్ర‌క‌టించింది. హుస్సేన్ సాగ‌ర్ తీరాన భారత రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని సీఎం కేసీఆర్ శుక్ర‌వారం ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ట్రాఫిక్ దృష్ట్యా.. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, పిట్ స్టాప్, జ‌ల‌విహార్, సంజీవ‌య్య పార్కు, అమోఘం రెస్టారెంట్‌తో పాటు ప‌లు సంద‌ర్శ‌న స్థ‌లాల‌ను మూసివేయ‌నున్నారు. దీంతో ప‌ర్యాట‌కులు ఈ […]

Hyderabad | 14వ తేదీన హైద‌రాబాద్‌లో పార్కులు, రెస్టారెంట్లు మూసివేత‌..!

Hyderabad |

ఈ నెల 14వ తేదీన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ప‌రిధిలోని అన్ని పార్కులు, రెస్టారెంట్ల‌ను మూసివేస్తున్న‌ట్లు హెచ్ఎండీఏ ప్ర‌క‌టించింది. హుస్సేన్ సాగ‌ర్ తీరాన భారత రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని సీఎం కేసీఆర్ శుక్ర‌వారం ఆవిష్క‌రించ‌నున్నారు.

ఈ క్ర‌మంలో ట్రాఫిక్ దృష్ట్యా.. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, పిట్ స్టాప్, జ‌ల‌విహార్, సంజీవ‌య్య పార్కు, అమోఘం రెస్టారెంట్‌తో పాటు ప‌లు సంద‌ర్శ‌న స్థ‌లాల‌ను మూసివేయ‌నున్నారు. దీంతో ప‌ర్యాట‌కులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని సూచించారు.

ఇక ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగ‌ర్, నెక్లెస్ రోడ్డు, మింట్ కంపౌండ్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఆ మార్గాల్లో వెళ్లే ప్ర‌యాణికులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వాహ‌న‌దారులు ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని ఉన్న‌తాధికారులు కోరారు. అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్లు చురుగ్గా కొన‌సాగుతున్నాయి.