Unity in Diversity: భిన్నత్వంలో ఏకత్వానికి.. అన్ని ప్రాంతాల భాగస్వామ్యం అవసరం: కోదండరాం

ప్రాంతాల సామాజిక ఉద్యమాలకు ప్రాధాన్యత కల్పించాలి దక్షిణాదిలో 2వ రాజధాని ఏర్పరచాలి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భిన్నత్వంలో ఏకత్వం అమలు జరగాలంటే దేశంలో అన్ని ప్రాంతాల సామాజిక సమూహాలకు అనుకూలమైన పరిపాలన అభివృద్ధి అవసరమని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. ఆయా ప్రాంతాల సామాజిక ఉద్యమాలు వాటి ప్రభావం తదితర అంశాల ప్రాతిపదికన ప్రణాళికలు ఉండాలని అన్నారు. దక్షిణ భారతదేశంలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలి అనే […]

Unity in Diversity: భిన్నత్వంలో ఏకత్వానికి.. అన్ని ప్రాంతాల భాగస్వామ్యం అవసరం: కోదండరాం
  • ప్రాంతాల సామాజిక ఉద్యమాలకు ప్రాధాన్యత కల్పించాలి
  • దక్షిణాదిలో 2వ రాజధాని ఏర్పరచాలి
  • టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భిన్నత్వంలో ఏకత్వం అమలు జరగాలంటే దేశంలో అన్ని ప్రాంతాల సామాజిక సమూహాలకు అనుకూలమైన పరిపాలన అభివృద్ధి అవసరమని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. ఆయా ప్రాంతాల సామాజిక ఉద్యమాలు వాటి ప్రభావం తదితర అంశాల ప్రాతిపదికన ప్రణాళికలు ఉండాలని అన్నారు.

దక్షిణ భారతదేశంలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలి అనే అంశంపై హనుమకొండలో గురువారం జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సింగరేణి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి సమస్యలు ఈ ప్రాంత ప్రజల జీవనంతో ముడిపడి ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి సంస్థలను కేంద్రం ప్రైవేటికరిస్తే ఈ ప్రాంతానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతుందన్నారు.

అందుకే అంబేద్కర్ దూర దృష్టితో దక్షిణాది ప్రాంతంలో రెండవ రాజధాని ఉండాలని ప్రతిపాదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమస్యపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ సదస్సుకు పింగిళి సంపత్ రెడ్డి అధ్యక్షత వహించారు. మాజీ ఎంపీ డా.మల్ల రవి, ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ తదితరులు ప్రసంగించారు.

ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు పార్లమెంటు సభ్యులలో అత్యధికంగా ఉన్నారు. ఈ పెద్ద రాష్ట్రాలు విభజించి, చిన్న రాష్ట్రాలు చేయవలసిన అవశ్యకత ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు తగిన న్యాయం జరగడం లేదని ఈ ప్రాంత ప్రజలు, విద్యావంతులు మేధావులు భావిస్తున్నారు.

దక్షిణాది భాషా, సంస్కృతి, అభివృద్ధి పరమైన వివక్షత కొనసాగుతుందన్నారు. అనేక రకాల వనరులు ఉన్నప్పటికీ తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నారు. అత్యధిక సముద్రతీరం, ప్రకృతి సంపద కలిగి ఉన్నా అభివృద్ధి, ప్రాజెక్టులలో తగిన విధంగా గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

డా.బి.ఆర్. అంబేద్కర్ పెద్ద రాష్ట్రాల వలన దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరగకపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారన్నారు. ఈ ప్రాంతంలో రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలని, అందుకు హైదరాబాదు మాత్రమే అనువైన ప్రాంతమని, ఇక్కడ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారన్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ సదస్సులో వన్నాల శ్రీరాములు, సోమ రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.