అసలు సంగతి ఏమిటంటే.. ఒక రైల్వే జనరల్ బోగీలో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. కొందరు కిందనే పడుకోగా, మరికొందరు కూర్చొనేందుకు మాత్రమే స్థలం లభించింది. ఇంకొందరు నిలబడి ప్రయాణం చేస్తున్నారు. దూర ప్రయాణం చేస్తున్న ఓ యువ ప్రయాణికుడు రెండు బెడ్ల మధ్య బెడ్‌షీట్‌తో తయారు చేసిన తాత్కాలిక ఊయల కట్టి హాయిగా పడుకొని ప్రయాణించాడు.
ఇందుకు సంబంధించిన ఘటనను హతీమ్ ఇస్మాయిల్ వీడియో తీసి సోషల్‌మీడియా పోస్టుచేశాడు. లోకల్ ట్రిప్ అనే క్యాప్షన్‌తో మలయాళంలో ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం సాగిస్తున్నాడు.. ఏ రైలు అనే వివరాలు లేనప్పటికీ.. ప్రయాణికుడి సెన్సాఫ్ హ్యూమర్‌కి ప్రయాణికులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను నెల వ్యవధిలో 9.5 మిలియన్ల ప్రజలు చూశారు. వేల సంఖ్యలో షేర్లు లైక్‌లు వచ్చాయి. పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు.