పవన్ కల్యాణ్ మరో రిమేక్.. ఈసారి విజయ్‌దే?
విధాత: ఇప్పటికే టాలీవుడ్‌లో అత్యధిక రిమేక్ సినిమాలు చేసిన హీరోగా పేరు సంపాదించిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మరో రెండు రెండు రిమేక్‌లు చేయడానికి నడుం కట్టాడు. అందులో ఒకటి కోలీవుడ్‌లో విజయ్ నటించిన తేరీ (తెలుగులో పోలీసోడు) కాగా రెండోది నటుడు, దర్శకుడు సముద్రఖని తానే నటిస్తూ దర్శకత్వం వహించిన వినోదాయ సిత్తం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన ఈ మధ్య కోర మీసాలు పెంచి […]

విధాత: ఇప్పటికే టాలీవుడ్‌లో అత్యధిక రిమేక్ సినిమాలు చేసిన హీరోగా పేరు సంపాదించిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మరో రెండు రెండు రిమేక్‌లు చేయడానికి నడుం కట్టాడు. అందులో ఒకటి కోలీవుడ్‌లో విజయ్ నటించిన తేరీ (తెలుగులో పోలీసోడు) కాగా రెండోది నటుడు, దర్శకుడు సముద్రఖని తానే నటిస్తూ దర్శకత్వం వహించిన వినోదాయ సిత్తం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన ఈ మధ్య కోర మీసాలు పెంచి కనిపిస్తూ ఉన్నారు. తాజాగా ఆయన రాజకీయ యాత్రల కోసం వారాహి వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి తీసుకురాగా పవన్ కళ్యాణ్ సింపుల్‌గా మీసాలు ట్రిమ్ చేసి డీసెంట్ లుక్‌లో కనిపించడంతో పవన్ నిజంగానే రీమేక్ కోసం కొత్తగా మేకోవర్ అవుతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి.
కోలీవుడ్‌లో విజయ్ నటించిన తేరీనే పవన్ తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్‌గా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ క్రమంలో సముద్రఖని నటించి దర్శకత్వం వహించిన వినోదాయ సిత్తం సినిమా రీమేక్ ను కేవలం ఒకటిన్నర నుంచి రెండు నెలల లోపు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.
ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమ పవన్ ఇమేజ్‌కి వినోదాయ సిత్తం సరిగ్గా సూట్ అవుతుందని భావించిన త్రివిక్రమ్ స్వయంగా స్క్రిప్ట్ విషయాలు చూసుకుంటున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను అతి త్వరలోనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే హరిహర వీరమల్లు కంటే ముందే వినోదాయ సిత్తం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
అయితే ఈ వినోదాయ సిత్తం చిత్రం తెలుగులో రాజేంద్రప్రసాద్ ఆ నలుగురు, వెంకటేశ్, పవన్ కల్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమాలను పోలి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా జీ5లో తెలుగులోను అందుబాటులో ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఏపాటి అలరిస్తుందో చూడాలి.
ఇవిగాక పవన్ సాహో దర్శకుడు సుజిత్‌తో పాటు గోపీచంద్ మలినేని, సురేందర్ రెడ్డి వంటి దర్శకులను కూడా లైన్లో పెడుతున్నారు. ఒకవైపు బస్సు యాత్ర చేస్తూ పవన్ ఇన్ని సినిమాల షూటింగ్‌లు ఎలా పూర్తి చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య హైదరాబాదద్‌లో హరిహర వీరమల్లు షూటింగ్‌లో పవన్ పాల్గొన్న బ్యాలెన్స్ షూటింగ్‌ను కూడా త్వరలో పూర్తి చేయనున్నాడని తెలుస్తోంది.