All Arjun | మ‌రోసారి మెగా వ‌ర్సెస్ అల్లు రచ్చ‌.. కావాల‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. బ‌న్నీ పేరు తీయ‌లేదా..!

All Arjun: ప్ర‌స్తుతం టాలీవుడ్ హీరోల మ‌ధ్య పోటీ ఓ రేంజ్‌లో ఉంది. ఒక‌రిని మంచి మ‌రొక‌రు అనేలా భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తూ త‌మ క్రేజ్ మ‌రింత పెంచుకుంటున్నారు. ఈ మ‌ధ్య ఆర్ఆర్ఆర్'తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. 'పుష్ప'తో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పేర్లు ప్యాన్ ఇండియా లెవల్లో మోత మోగిపోయాయి. ప్రస్తుతం వీరిద్దరి క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగింద‌ని చెప్పాలి. అయితే చిరంజీవి స్పూర్తితో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన బ‌న్నీ మెల్లమెల్ల‌గా మెగా ఫ్యామిలీ నీడలో […]

  • By: sn    latest    Jul 26, 2023 5:44 AM IST
All Arjun | మ‌రోసారి మెగా వ‌ర్సెస్ అల్లు రచ్చ‌.. కావాల‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. బ‌న్నీ పేరు తీయ‌లేదా..!

All Arjun: ప్ర‌స్తుతం టాలీవుడ్ హీరోల మ‌ధ్య పోటీ ఓ రేంజ్‌లో ఉంది. ఒక‌రిని మంచి మ‌రొక‌రు అనేలా భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తూ త‌మ క్రేజ్ మ‌రింత పెంచుకుంటున్నారు. ఈ మ‌ధ్య ఆర్ఆర్ఆర్’తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ‘పుష్ప’తో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పేర్లు ప్యాన్ ఇండియా లెవల్లో మోత మోగిపోయాయి. ప్రస్తుతం వీరిద్దరి క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగింద‌ని చెప్పాలి. అయితే చిరంజీవి స్పూర్తితో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన బ‌న్నీ మెల్లమెల్ల‌గా మెగా ఫ్యామిలీ నీడలో నుంచి బయటకు వచ్చి ప్యాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయ‌న‌కు స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్నాడు.

అయితే ఇటీవ‌ల బ‌న్నీ వ‌ర్సెస్ మెగా హీరోల‌న్న‌ట్టుగా చ‌ర్చ న‌డుస్తుంది. ప‌లు సంద‌ర్భాల‌లో వారు చేసే కామెంట్స్ నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. పవన్ కళ్యాణ్ .. సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం గురించి అలానే రొడ్ల గురించి అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాల మీద సెటైర్లు వేసినట్టు మాట్లాడాడు. ఇక కోలీవుడ్ ప‌రిశ్ర‌మ తెలుగు సినిమా న‌టీన‌టులని న‌టింప‌జేయ‌క‌పోవ‌డంపై కూడా మాట్లాడారు. అలానే త‌న‌కు అంద‌రు హీరోలు ఇష్ట‌మ‌ని చిన్నా, పెద్దా అన్నది నేను చూడను.. నాకు అందరూ సమానమే అని అన్నారు ప‌వ‌న్.

సినిమాలంటే నాకు ప్రాణం కానీ సమాజం అంటే ఎంతో బాధ్యత అని చెప్పుకొచ్చాడు. ఇంత‌క‌ ముందులా ఉండి ఉంటే.. తాను మరిన్ని సినిమాలు తీసేవాడిని అని ప‌వ‌న్ అన్నాడు. అయితే తాను ఎన్టీఆర్, రామ్ చరణ్‌లా డ్యాన్సులు చేయలేకపోవచ్చు గానీ.. ప్రభాస్‌లా, రానాల ఓ సినిమాకు అన్నేళ్లు కష్టపడి బాడీ బిల్డింగ్ చేయడం కూడా నేను చేయ‌లేను అని ప‌వ‌న్ అన్నారు. మ‌ధ్యలో వ‌రుణ్ తేజ్, చ‌రణ్‌, సాయి ధ‌ర‌మ్, వైష్ణ‌వ్ పేర్లు కూడా తీసాడు. కాని ఒక్క‌సారి కూడా బ‌న్నీ ప్ర‌స్తావ‌న తీయ‌క‌పోవ‌డం హాట్ టాపిక్ అయింది. డ్యాన్సుల విషయంలో ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ పేరుని ఎలా మరిచిపోతారు అంటూ అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కూనిరాగాలు తీస్తున్నారు. చెప్పను బ్రదర్ ఎపిసోడ్ ఎఫెక్ట్ వ‌ల‌నే ప‌వ‌న్ నోట బ‌న్నీ పేరు రాలేద‌ని, వారిద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింద‌ని ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మ‌రోసారి అల్లు వ‌ర్సెస్ మెగా వార్ ప్ర‌స్తావ‌నికి వ‌చ్చింది.