AP Global Investors Summit 2023 | గ్లోబల్ సమ్మిట్: బాబు సైలెంట్.. పవన్ పాజిటివ్ ట్వీట్స్!

విధాత‌: Global investors summit 2023 | గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ విషయంలో చంద్రబాబు ఎక్కడా స్పందించినట్లు కనిపించలేదు. కానీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ (Pawan Kalyan) మాత్రం పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి (Development of the state) కోసం తమ సపోర్ట్ ఉంటుంది అంటూనే అవినీతి (Corruption)కి తావు ఇవ్వొద్దని సూచించారు. ఈమేరకు వరుస ట్వీట్స్ చేశారు. ఈ రెండ్రోజులూ ప్రభుత్వాన్ని ఏవిధంగానూ ఇబ్బంది పెట్టే ప్రకటనలు చేయబోమన్నారు. ట్వీట్‌ 1 ప్రకృతి అందాలతో అలరారే […]

  • By: Somu |    latest |    Published on : Mar 03, 2023 6:32 AM IST
AP Global Investors Summit 2023 | గ్లోబల్ సమ్మిట్: బాబు సైలెంట్.. పవన్ పాజిటివ్ ట్వీట్స్!

విధాత‌: Global investors summit 2023 | గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ విషయంలో చంద్రబాబు ఎక్కడా స్పందించినట్లు కనిపించలేదు. కానీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ (Pawan Kalyan) మాత్రం పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి (Development of the state) కోసం తమ సపోర్ట్ ఉంటుంది అంటూనే అవినీతి (Corruption)కి తావు ఇవ్వొద్దని సూచించారు. ఈమేరకు వరుస ట్వీట్స్ చేశారు. ఈ రెండ్రోజులూ ప్రభుత్వాన్ని ఏవిధంగానూ ఇబ్బంది పెట్టే ప్రకటనలు చేయబోమన్నారు.

ట్వీట్‌ 1

ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి దేశవిదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన(Janasena) స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ (Global investors summit) ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, మన యువతకు ఉపాధి (employment)ని అందించే అవకాశం కల్పించడంతోపాటు ఇన్వెస్టర్లు (Investors) కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నాను.

ట్వీట్‌ 2

వైసీపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం. ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి. రివర్స్‌ టెండరింగ్‌(Reverse tendering), మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి!

ట్వీట్‌ 3

ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం విశాఖకే పరిమితం చేయవద్దు. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లాగా మార్చండి.

ట్వీట్‌ 4

ఇక చివరిగా రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సహకారం అందిస్తుంది. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్ర శ్రేయస్సు మిన్న.