మాజీ ఎమ్మెల్యే ఉంగరం అదృశ్యం.. డాగ్ స్క్వాడ్‌తో వెతికిన పోలీసులు!
NVSS Prabhakar | మన చేతి వేళ్లకు ఉన్న ఉంగరాలు అదృశ్యమైతే చాలా ఆందోళనకు గురవుతాం. అదృశ్యమైన ఉంగరం కోసం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుకుతాం. దొరికితే దొరకొచ్చు.. లేదంటే లేదు. కానీ విలువైన ఉంగరం అయితే.. దాన్ని దొరికించుకునేందుకు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఆ మాదిరిగానే బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూడా అదృశ్యమైన ఉంగరం కోసం వెతికారు. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. మరి ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు.. బీజేపీ నేత […]

NVSS Prabhakar | మన చేతి వేళ్లకు ఉన్న ఉంగరాలు అదృశ్యమైతే చాలా ఆందోళనకు గురవుతాం. అదృశ్యమైన ఉంగరం కోసం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుకుతాం. దొరికితే దొరకొచ్చు.. లేదంటే లేదు. కానీ విలువైన ఉంగరం అయితే.. దాన్ని దొరికించుకునేందుకు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఆ మాదిరిగానే బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూడా అదృశ్యమైన ఉంగరం కోసం వెతికారు. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. మరి ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు.. బీజేపీ నేత ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్‌కు ఫామ్ హౌస్ ఉంది. ఆ వ్యవసాయ క్షేత్రంలో పనులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని పరిశీలించేందుకు నిన్న ఉదయం అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ప్రభాకర్ చేతికి ఉన్న నవరత్నాలతో కూడిన ఉంగరం అదృశ్యమైంది. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన సిబ్బంది వెతికినప్పటికీ ఉంగరం ఆచూకీ లభించలేదు.
తీవ్ర ఆందోళనకు గురైన ప్రభాకర్.. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌కు సమాచారం అందించారు. దీంతో టెక్నికల్ పోలీసులు, డాగ్ స్క్వాడ్ ప్రభాకర్ ఫామ్ హౌస్‌లో వాలిపోయారు. వ్యవసాయ క్షేత్రాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి నిమిషాల వ్యవధిలో నవరత్నాల ఉంగరాన్ని వెతికి పెట్టారు. దీంతో పోలీసులకు ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.