New Parliament | పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభంపై కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యస్త్రాలు..!
New Parliament | పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీని గురువారం కలిసి.. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని ఆహ్వానించారు. అయితే హిందుత్వ భావజాలాన్ని అభివృద్ధి చేసిన వినాయక్ దామోదర్ సావర్కర్(వీర్ సావర్కర్) జయంతి రోజున(మే 28) పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పార్లమెంట్ కొత్త […]

New Parliament |
పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీని గురువారం కలిసి.. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని ఆహ్వానించారు. అయితే హిందుత్వ భావజాలాన్ని అభివృద్ధి చేసిన వినాయక్ దామోదర్ సావర్కర్(వీర్ సావర్కర్) జయంతి రోజున(మే 28) పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఈ పార్లమెంట్ కొత్త భవనంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ట్విట్టర్ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇది ప్రధాని మోదీ యొక్క పర్సనల్ వ్యానిటీ ప్రాజెక్టుల అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రతిపక్షాల మైక్రో ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసినప్పుడు ఇలాంటి భవనాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఇది భవనం మాత్రమేకాదు.. గొంతు లేని వారి గొంతు అని విమర్శించారు.
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్.. పార్లమెంట్ భవనంలో మోదీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. పార్లమెంట్ కొత్త భనవానికి ఏకైక ఆర్కిటెక్ట్, డిజైనర్, వర్కర్ ఆయనే అని మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇదంతా మోదీ పర్సనల్ వ్యానిటీ ప్రాజెక్టు అని జై రాం రమేశ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్ కూడా స్పందించారు. పార్లెమంట్ భవనం కేవలం ఇటుక, సిమెంట్ మాత్రమే కాదు.. గొంతు లేని ప్రజల గొంతు అని విమర్శించారు. ప్రతిపక్షాల మైకులు స్విచ్ఛాఫ్ చేసినప్పుడు ఈ భవనం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.
After 76 years of Independence our PM @narendramodi will dedicate India’s very own New Parliament.
28th May is Vinayak Damodar Savarkar birth day
Thank You Modi ji