ఒక్క ఓట‌రు కోసం పోలింగ్ బూత్‌.. ఎక్క‌డంటే..?

ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది. అందుకే ఎలాంటి ప్రలోభాలకు తలవంచకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్సూచి అయిన ఓటును వినియోగించుకోవటం ప్రజల ప్రధాన కర్తవ్యం. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘం చెబుతూనే ఉంటుంది. గురువారం జ‌రిగిన గుజ‌రాత్ […]

ఒక్క ఓట‌రు కోసం పోలింగ్ బూత్‌.. ఎక్క‌డంటే..?

ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది. అందుకే ఎలాంటి ప్రలోభాలకు తలవంచకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్సూచి అయిన ఓటును వినియోగించుకోవటం ప్రజల ప్రధాన కర్తవ్యం. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది.

అందుకే ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘం చెబుతూనే ఉంటుంది. గురువారం జ‌రిగిన గుజ‌రాత్ అసెంబ్లీ తొలి విడుత ఎన్నిక‌ల్లో ఒక్క ఓటరు కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఎన్నిక‌ల అధికారులు. గిర్ ఫారెస్ట్‌లో ఉన్న మ‌హంత్ హ‌రిదాస్‌జీ ఉదాసీన్ కోసం గిర్ ప‌రిధిలోని బ‌నేజ్‌లో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రంలో మ‌హంత్ హ‌రిదాస్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇక పోలింగ్ స‌మ‌యం ముగిసే వ‌ర‌కు అధికారులు అక్క‌డే విధుల్లో ఉన్నారు.