పాలిసెట్ ఎంట్రన్స్ టెస్టు వాయిదా
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలిసెట్‌ను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది. షెడ్యూల్ కారం మే 17న పాలీసెట్ నిర్వహించాల్సి ఉన్నది.

విధాత, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలిసెట్‌ను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది. షెడ్యూల్ కారం మే 17న పాలీసెట్ నిర్వహించాల్సి ఉన్నది. అయితే ఎంట్రెన్స్ టెస్ట్‌ను మే 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ మండలి కార్యదర్శి ఏ పుల్లయ్య తెలిపారు.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనుండగా, తెలంగాణలో నాలుగో విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగో విడుతలో మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా.. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ మధ్యలో పాలీసెట్ నిర్వహించడం ఇబ్బందికరంగా భావించి వాయిదాకు నిర్ణయం తీసుకున్నారు.